E-Paper
Advertisement

Additional SP Mahender: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : అదనపు ఎస్పీ మహేందర్!

Additional SP Mahender: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి  : అదనపు ఎస్పీ మహేందర్!
Advertisement

Additional SP Mahender:  మెదక్ మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను అదనపు ఎస్పీ మహేందర్ (Additional SP Mahender) పరిశీలించారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని వేస్లీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల అమరిక, బ్యారికేడింగ్ విధానం వంటి అంశాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి రవాణా సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Also Read:Golden Hour Treatment: ఇదే విచిత్రం మెడికల్ కాలేజీలు వచ్చినా.. గోల్డెన్ అవర్ మిస్..?

కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలి 

Advertisement

అనంతరం మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాడల్ డే కేర్ సెంటర్ పోలింగ్ కేంద్రాన్ని, అలాగే దయరా, నవాబ్‌పేట్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ

అనుమానాస్పద కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. ఓటర్లు ఎలాంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే విజయవంతంగా నిర్వహించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గారి వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also Read: Bengaluru Crime: ఛీ.. ఛీ.. ఇదేం కూతురు.. ఏకంగా తల్లి ఫోటోలు ప్రియుడికి పంపి, ఆ తర్వాత

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×