E-Paper
Advertisement

Golden Hour Treatment: ఇదే విచిత్రం మెడికల్ కాలేజీలు వచ్చినా.. గోల్డెన్ అవర్ మిస్..?

Golden Hour Treatment: ఇదే విచిత్రం మెడికల్ కాలేజీలు వచ్చినా.. గోల్డెన్ అవర్ మిస్..?

Golden Hour Treatment: స్వేఛ్చ బ్యూరో: “భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి(40) వారం రోజుల క్రితం యాక్సిడెంట్‌లో తలకు తీవ్ర గాయలయ్యాయి. జిల్లా హెడ్ క్వార్టర్ లోని మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్ కు వెళ్లారు. పరిశీలించిన అక్కడి డాక్టర్లు బ్లడ్ కాట్ అయిందని, వెంటనే ఎంజీఎం కు వెళ్లాలని రిఫర్ చేశారు. అదే ఆసుపత్రిలోని మరి కొందరు డాక్టర్లు నేరుగా హైదరాబాద్ కు వెళ్తే బెటర్ అంటూ సలహాలు ఇచ్చారు. దీంతో సదరు పేషెంట్ కుటుంబం ఆ పేషెంట్ ను నిమ్స్ కు తీసుకువెళ్లారు. అక్కడ వెంటిలేటర్స్ బెడ్స్ లేవని, వెంటనే గాంధీ, ఉస్మానియాకు తీసుకువెళ్లాలని నిమ్స్ ఎమర్జెన్సీ విభాగపు డాక్టర్లు రిఫర్ చేశారు. చేసేదేమీ లేక గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం క్రిటికట్ స్టేజ్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ పేషెంట్ కు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి సుమారు ఆరు గంటల పైనే సమయం, ఆసుపత్రిలో అడ్మిషన్ లభించడం దానికి మరో గంటన్నర సమయం పట్టింది. ఈ క్రమంలో పేషెంట్ మరింత క్రిటికల్ కు చేరుకున్నాడని డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజీలో ఈ కేసును హ్యండిల్ చేసే సౌకర్యాలు, డాక్టర్లు ఉన్నట్లు హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ అక్కడి డాక్టర్లు ప్రాథమికంగా పరిశీలించి రిఫర్ అంటూ సూచించడం గమనార్హం’’.

ఈ తరహాలో వ్యవహరిస్తున్నారా?

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒకటి చొప్పున మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చినా…పేషెంట్లకు గోల్డెన్ అవర్ మిస్ అవుతున్నది. అంటే ప్రమాదం జరిగిన తొలి గంటలో వైద్యం అందడమనేది అతి ముఖ్యం. కానీ ఏజెన్సీ ఏరియాల్లోని మెడికల్ కాలేజీల్లో ఈ పరిస్థితి లేనట్లు స్పష్టమవుతున్నది. గాంధీ, ఉస్మానియా తరహాలోనే అన్ని జిల్లాల్లో డాక్టర్లు, స్టాఫ్​, సౌకర్యాలు ఉన్నాయంటూ ప్రభుత్వంతో పాటు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులూ చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ గా కనిపిస్తున్నది. ఆయా దావఖానల్లో వైద్యం అందించలేమని, వెంటనే హైదరాబాద్ పెద్దాసుపత్రులకు వెళ్లాలని మెడికల్ కాలేజీ డాక్టర్లు చెప్పడం విచిత్రకరం. సౌకర్యాలు లేక రిఫర్లు చేస్తున్నారా? వర్క్ నుంచి తప్పించుకునేందుకు కొందరు డాక్టర్లు ఈ తరహాలో వ్యవహరిస్తున్నారా? అనేది తెలియాల్సి ఉన్నది. వైద్యం డీ సెంట్రలైజ్ కావాలని హెల్త్ మినిస్టర్ ఇప్పటికే పలుమార్లు జరిగిన రివ్యూల్లో ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ కావడం లేదని రిఫర్ విధానాలను పరిశీలిస్తే అర్థమవుతున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో ఈ సిచ్వేషన్ నెలకొన్నది.

Also Read: Municipal Elections: నేటితో ముగియనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం..!

హెల్త్ కండీషన్ సీరియస్..

జిల్లాల్లోనే మెరుగైన వైద్యం అందకపోవడంతో హైదరాబాద్ కు వస్తున్న పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారుతుందని స్వయంగా డాక్టర్లే చెప్తున్నారు. సుమారు రెండు వందలు, అంతకంటే ఎక్కువ కిలో మీటర్ల పాటు జర్నీ చేసి గాంధీ, ఉస్మానియా కు చేరే లోపే పేషెంట్ల కండీషన్ సీరియస్ అవుతున్నట్లు వివరిస్తున్నారు. ప్రాణాలు బ్రతికించేందుకు తామెంత కష్ట పడ్డా పేషెంట్ అడ్మిషన్ కు ఆలస్యం అవడంతో కొన్ని సందర్భాల్లో నష్టం జరుగుతుందని వెల్లడించారు. ఏజెన్సీ ఏరియాల నుంచి వస్తున్న పేషెంట్లకు ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉన్నట్లు గాంధీలోని ఓ డాక్టర్ వివరించారు. జిల్లాల నుంచి పేషెంట్లు ఎక్కువ వస్తున్న నేపథ్​యంలో గాంధీ, ఉస్మానియాలోనూ పరిమితికి మించి పేషెంట్ల లోడ్ పెరుగుతున్నది. దీంతో డాక్టర్లు, స్టాప్ కు కూడా వైద్యం వేగంగా అందించడం సవాల్ గా మారింది.

యాక్సిడెంట్ , కిడ్నీ డ్యామేజ్ కేసులే ఎక్కువ..?

జిల్లాల నుంచి ఉస్మానియా, గాంధీకి రిఫర్ చేస్తున్న కేసుల్లో అత్యధికంగా యాక్సిడెంట్, కిడ్నీ డ్యామేజ్ , విషం తాగిన కేసులే ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. తలకు తీవ్రమైన గాయాలన్నీ రక్తం గడ్డ కట్టడం, మెదడు డ్యామేజ్ కావడం వంటి క్రిటికల్ కేసులకు వైద్యం అందించాల్సి వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. దీంతో పాటు కిడ్నీ పంక్షనింగ్ లో సమస్యలున్నా…జిల్లాల్లో కేసులు ఆపకుండా ఈ పెద్దాసుపత్రులకు రిఫర్ చేసేస్తున్నారని స్వయంగా వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులే చెప్తున్నారు. వాస్తవానికి అన్ని జిల్లాల మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ లూ ఉన్నాయి. సుమారు 75 నుంచి 85 శాతం కేసులకు అక్కడే వైద్యం అందించే పరిస్థితులు ఉంటాయి. ఆయా ఆసుపత్రుల్లో ఇలాంటి పేషెంట్లకు మెరుగైన వైద్య​ం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సౌలత్ లు కల్పించింది. కానీ మొదట్నుంచి రిఫర్ వ్యవస్థకు అలవాటు పడ్డ కొందరు డాక్టర్లు ..పేషెంట్లకు రాగానే చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులపై ఇప్పటికే ఆరోగ్యశాఖ సీరియస్ గా తీసుకున్నది. ప్రత్యేక కమిటీని కూడా నియమించనున్నది. ఇలాంటి పరిస్థితులను అంచనా వేసి, ఎక్కడికక్కడ పేషెంట్ల కు వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

Also Read: Thummala Nageswara Rao: మీ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దు.. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల ఫైర్..!

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×