E-Paper
Advertisement

Harish Rao: కేసీఆర్ రైతులకు అన్నం పెడితే.. కాంగ్రెస్ సున్నం పెట్టింది, హరీష్ రావు ధ్వజం

Harish Rao: కేసీఆర్ రైతులకు అన్నం పెడితే.. కాంగ్రెస్ సున్నం పెట్టింది, హరీష్ రావు ధ్వజం
Advertisement

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలను కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రైతు సంక్షేమం – నాడు నేడు..

Advertisement

హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో రైతులు రాజులా బతికారని గుర్తు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సాఫీగా రుణమాఫీ జరిగిందని, రైతు బంధు పెట్టుబడి సాయం నేరుగా ఖాతాల్లోకి చేరిందని తెలిపారు. అప్పట్లో యూరియా కోసం రైతులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదని, సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో యూరియా కావాలంటే రైతులు రోజుల తరబడి క్యూ లైన్లలో వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ రామాయంపేట..

Advertisement

రామాయంపేట ప్రజల దశాబ్దాల కల అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని హరీష్ రావు స్పష్టం చేశారు. కేవలం పరిపాలన విభాగమే కాకుండా.. మున్సిపాలిటీ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 30 కోట్ల భారీ నిధులను కేటాయించిందని గుర్తు చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల కల్పనలో తాము చేసిన కృషిని ప్రజలు గమనించాలని కోరారు.

సంక్షేమ పథకాలు – విమర్శలు..

మహిళల కోసం కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టి పేద కుటుంబాలకు అండగా నిలిచింది కేసీఆర్ అని ఆయన కొనియాడారు. ముఖ్యంగా బీడీ కార్మికుల కష్టాలను గుర్తించి వారికి పెన్షన్లు అందజేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. అయితే, అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపిందని మండిపడ్డారు. ‘కేసీఆర్ హయాంలో రైతులకు అన్నం పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం సున్నం పెట్టింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీని ఎగ్గొట్టి రైతులను వంచించిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

ALSO READ: No Confidence Motion: స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. పార్లమెంట్‌లో విపక్షాల పోరు!.

Related News

బర్తరఫ్ తర్వాత తొలిసారి నోరు విప్పిన కొండా సురేఖ..సీయం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

Big Stories

Advertisement
×