Adilabad Road Accident: భక్తులందరూ దైవదర్శనానికి వెళ్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ భక్తులు ప్రయాణిస్తున్న వాహనం అకస్మాత్తుగా బోల్తాపడడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. ఏం జరిగిందో గ్రహించేలోగానే, రహదారికి ఇరువైపులా చెల్లాచెదురుగా పడ్డ భక్తులు కాపాడమని రోదించారు. ఈ ఘటన అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్ వద్ద ఆదివారం జరిగింది.
గుడిహత్నూర్ మండలం సూర్య గూడ గ్రామానికి చెందిన ఆదివాసులు ఆదివారం కేరమేరి మండలంలోని జంగుబాయి ఆలయాన్ని దర్శించేందుకు ఐచర్ వాహనంలో బయలుదేరారు. మొత్తం 60 మంది భక్తులు అమ్మవారి నామాన్ని జపిస్తూ వాహనంలో వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. మాలేపూర్ ఘాటు వద్దకు వాహనం రాగానే వాహనం అది తప్పి బోల్తా పడింది. దీనితో వాహనంలోని భక్తులు గట్టిగా కేకలు వేయరా స్థానికులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Also Read: kumbh mela: కుంభమేళాలో టాప్ బిజినెస్ ఇదే.. లక్షల్లో లాభాలు..
వాహనంలో ప్రయాణిస్తున్న 47 మంది భక్తులకు గాయాలు కాగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. కొందరిని అదిలాబాద్ రిమ్స్, మరికొందరిని నార్నూర్, మిగిలిన వారిని ఉట్నూర్ వైద్యశాలలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తున్న భక్తుల ఐచర్ వాహనం బోల్తా పడినట్లు సమాచారం అందుకున్న వారి గ్రామస్తులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, భక్తుల ద్వారా వివరాలు ఆరాతీస్తున్నారు.