BigTV English

Ex MP Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Ex MP Ramesh Rathod : మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Ex MP Ramesh Rathod Passed Away(Today news in telangana): ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవ్వడంతో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. శనివారం ఉదయం కిడ్నీ సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను.. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలిస్తుండగా మృతి చెందారు. రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఉట్నూర్ కు తరలించనున్నారు.


ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. తొలిసారి 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ తరఫున ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004 వరకూ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2006లో ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికై 2009 వరకూ బాధ్యతలు నిర్వహించారు. 2009లో 15వ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి.. గెలిచారు. ఆ తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. కొన్నినెలలకే ఆ పార్టీని వీడి.. కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2021లో కాంగ్రెస్ ను వీడి కమలం పార్టీలో చేరారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఖానాపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి మళ్లీ ఓటమి పాలయ్యారు. కాగా.. రమేష్ రాథోడ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేశారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×