టీమ్ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు అదరగొట్టారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఉమన్స్ టెస్ట్ క్రికెట్ రిత్రలో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా టీమ్ ఇండియా అవతరించింది. మొదట షఫాలీ వర్మ డబుల్ సెంచరీ చేసింది. స్మృతి మంథాన 149 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (69), రిచాఘోష్ (86), రొడ్రిగస్ (55) ధనాధన్ ఆడి 6 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా (575/9 డిక్లేర్డ్) పేరిట ఉండేది. వాళ్లు కూడా సౌతాఫ్రికాపైనే చేయడం విశేషం.
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 525 పరుగులు చేసింది. రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ అదే దూకుడు కొనసాగించింది. మరో రెండు వికెట్లు పడిన తర్వాత 143 పరుగులు జోడించి 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
ఓపెనర్లు షఫాలీ వర్మ 197 బంతుల్లో 8 సిక్స్ లు, 23 ఫోర్ల సాయంతో 205 పరుగులు చేసింది. స్మృతి మంథాన 161 బంతుల్లో 1 సిక్స్, 27 ఫోర్ల సాయంతో 149 పరుగులు చేసి రనౌట్ అయ్యింది. షెఫాలీ, మంథాన ఇద్దరూ తొలి వికెట్ కు 292 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటివరకు మహిళా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ కు 241 పరుగులు చేసిన కిరణ్ బలుచ్, సజ్జిదా షా జోడీ రికార్డును వీరు బద్దలు కొట్టారు.
Also Read: నిలిచేదెవరు? గెలిచేదెవరు? టీ 20 ప్రపంచకప్ మహాపోరు నేడే..
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( 69), రిచా ఘోష్ (86) ,సుభా సతీశ్ (15), జెమీమా రోడ్రిగ్స్ (55) పరుగులు చేశారు.
చివరికి లంచ్ ముందు దక్షిణాఫ్రికాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి సఫారీలు వికెట్ నష్టపోకుడా 29 పరుగులు చేశారు. క్రీజులో లారా (17 నాటౌట్), అన్నెకె (12 నాటౌట్ ) ఉన్నారు.