Big Stories

Rajashyamala yagam : రాజశ్యామల యాగంపై ఆగమాగం.. ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్

Rajshyamala yagam

Rajashyamala yagam : రాజ్యాన్ని నిలిపి రాజుని చేసే యాగం. రాజును చక్రవర్తిని చేసే యాగం. యుద్ధంలో శత్రువును ఓడించి విజయాన్ని కట్టబెట్టే యాగం. రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచే యాగం. శత్రు నాశనం, శాశ్వత అధికారం ఇచ్చే యాగం. అదే రాజశ్యామల యాగం. ద్వాపర యుగంలో చేసిన రాజసూయ యాగానికి, రాజశ్యామల యాగానికి పోలిక ఉందంటారు కొందరు పండితులు. రెండింటి లక్ష్యం, పరమార్థం ఒక్కటే. ఆనాడు రాజసూయ యాగం తరువాతే పాండవులకు శత్రు నాశనం, కీర్తి, విజయం దక్కాయని చెబుతారు. మయసభలో దుర్యోధనుడికి పరాభవం జరిగింది కూడా అప్పుడే. మహాభారత యుద్ధానికి మూలం కూడా ఇక్కడే జరిగిందంటారు. ఇక రాజసూయ యాగం పూర్తైన తర్వాత శిశుపాలుడి వధ జరిగిందని, శత్రు సంహారం జరుగుతుందనడానికి ఇదే నిదర్శనం అని చెబుతారు.

- Advertisement -

అధికారం చేజిక్కించుకోవడం కోసం రాజశ్యామల యాగం చేస్తారు. అధికారం నిలుపుకోవడం కూడా చేస్తారు. మరో కోణం కూడా ఉంది. తన విజయానికి ఎదురు లేదు అని శత్రువులకు చాటి చెప్పడానికి కూడా ఈ యాగం చేస్తారని చెబుతున్నారు. ఈ కాలంలో రాజసూయ యాగం చేయడం చాలా కష్టం. ఎందుకంటే, ఈ యాగాన్ని ఏడాది పాటు చేస్తారు. లేదంటే, 41 రోజులు చేయొచ్చు. 21 రోజుల పాటు చేసే ప్రక్రియ కూడా ఉంది. ఇక 16 రోజులు, 3 రోజులు చేసే ప్రక్రియ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ 3 రోజులు యాగాలే. రాజసూయం బదులు ఇప్పుడంతా రాజశ్యామల యాగాన్ని మూడు రోజుల పాటు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ మధ్య ఈ యాగం జరిపిస్తున్నారు. రాజ శ్యామల యాగంతో శత్రు బలం తగ్గుతుంది, రాజకీయాల్లో విజయలక్ష్మి వరిస్తుందని నమ్ముతున్నారు.

- Advertisement -

తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా రాజశ్యామల యాగం చేస్తున్నారు. గతంలో విశాఖ శారదాపీఠంలో జరిగిన యాగానికి సీఎం జగన్ వెళ్లారు. కాని, ఈసారి జరిగే యాగంపై మాత్రం రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రజల కోసం యాగం జరిపిస్తున్నామన్న పేరుతో… జగన్ పేరు మీద యాగం చేయిస్తున్నారనేది టీడీపీ విమర్శ. దేవుడి సొమ్ముతో సీఎం జగన్ ఆర్భాటాలు చేస్తున్నారని, 10 కోట్ల రూపాయల దేవాలయాల సొమ్ముతో ఈ యాగం చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపిస్తున్నారు. ఈ యాగానికి టీటీడీ నుంచి రెండున్నర కోట్లు ఖర్చు చేస్తున్నారని కూడా ఆరోపించారు. పైగా శారదా పీఠాధిపతిని పక్కన పెట్టి.. బెంగళూరు లాబీయిష్టు అయిన విజయకుమార్ ఆధ్వర్యంలో ఈ యాగం చేస్తున్నారని మండిపడుతోంది టీడీపీ.

గతంలో సీఎం కేసీఆర్ రాజశ్యామల యాగం చేయించినా.. దానిపై విమర్శలేం రాలేదు. అవన్నీ సొంతంగా చేయించుకున్న యాగాలు. నిజానికి సీఎం కేసీఆర్‌ను చూసే సీఎం జగన్ కూడా రాజశ్యామల యాగం చేయిస్తున్నారనే టాక్ నడుస్తోంది. యాగం చేసిన ప్రతిసారి సీఎంగా కేసీఆర్ విజయం అందుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మళ్లీ రాజశ్యామల యాగం చేస్తున్నారు. కేసీఆర్ యాగం చేసిన ప్రతిసారీ అందుకు ప్రతిఫలం పొందారని.. ఈసారి కూడా రాజశ్యామల యాగం ద్వారా జాతీయ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News