BigTV English

HCU FactCheck: AI ఫోటోలతో HCU ఫేక్ ప్రచారం, కిషన్ రెడ్డి గారూ మీరు కూడానా?

HCU FactCheck: AI ఫోటోలతో HCU ఫేక్ ప్రచారం, కిషన్ రెడ్డి గారూ మీరు కూడానా?

HCU Gachibowli Land Issue AI Photos: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంలో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐటీ పరిశ్రమ విస్తరణ కోసం ఉపయోగించాలని నిర్ణయించింది. అక్కడి చెట్లను తొలగించి భూమిని సిద్ధం చేయాలనుకుంది. కానీ, యూనివర్సిటీ విద్యార్థులతో పాటు పలు పార్టీల నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అడవిని తొలగించకూడదంటూ ఆందోళన మొదలు పెట్టారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమానికి దిగారు. చివరకు కోర్టుల జోక్యంతో అడవి తొలగింపు పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే, ఈ ఉద్యమం సందర్భంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఫోటోల విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. AI ఫోటోలను నిజం ఫోటోలుగా భ్రమింపజేయడం పట్ల తాజా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు.


ఫేక్ ఫోటోలు, అవాస్తవ వీడియోలు   

⦿ బుల్డోజర్ శబ్దాలకు పారిపోతున్న నెమళ్లు, జింకలు


ఈ చిత్రం HCUలో జరిగినట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు తేల్చారు. ఈ ఫోటోను AI టూల్స్ ఉపయోగించి తయారు చేసినట్లు నిర్దారించారు. ఈ అవాస్తవ ఫోటోను ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా షేర్ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు తేల్చారు.

⦿ జింక నిజంగానే చనిపోయిందా?   

ఇక HCUలో అడవి తొలగింపు కారణంగా ఓ జింక చనిపోయినట్లు ప్రచారం చేశారు. అయితే, ఈ ఫోటోకు HCUకు ఎలాంటి సంబంధం లేదు. వేటగాళ్లు చంపిన జింక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ నిజమే అని నమ్మించే ప్రయత్నం చేశారు. చనిపోయిన జింకకు కాళ్లు కట్టి ఉండటం ఈ ఫోటో గుర్తించవచ్చు. ఈ ఫోటోను జర్నలిస్టు సుమిత్ ఝా పోస్టు చేసి, ఆ తర్వాత డిలీట్ చేశాడు. తప్పుడు పోస్టు చేసినందుకు చింతిస్తున్నట్లు ప్రకటించాడు.

 ⦿ జనావాసాల్లోకి జింక వచ్చిందా?

HCU నుంచి ఓ జింక జనావాసాల్లోకి వచ్చిందటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఇది నిజానికి నకిలీ వీడియో కాదు. కానీ, ఈ జింక విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన వీడియో. దీన్ని HCUకు లింక్ చేసి ప్రచారం చేశారు.

⦿ బుల్డోజర్లతో అడవి తొలగింపు

ఇక బుల్డోజర్లను ఉపయోగించి అడవిని తొలగిస్తున్నారంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో కూడా AI ద్వారానే క్రియేట్ చేశారు. ఈ వీడియో కూడా మేనిప్యులేట్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

మొత్తంగా HCU ఉద్యమంలో AI ఫోటోలు, ఫేక్ వీడియోలు కీలక పాత్ర పోషించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రచారాలను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకునే దిశగా ముందడుగువేస్తోంది. ఫేక్ ప్రచారాలు చేసేవారిపైనా చర్యలు తీసుకునేలా సమాలోచనలు చేస్తోంది.

Read Also: ఆ ఫోటోలు, వీడియోలన్నీ ఫేక్.. హెచ్‌సీయూ వివాదంపై సీఎం రేవంత్ ఏమన్నారంటే..?

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×