E-Paper
Advertisement

పల్నాడు ప్రాజెక్టుపై మౌనం ఎందుకు?.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

పల్నాడు ప్రాజెక్టుపై మౌనం ఎందుకు?.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్
Advertisement

Harish Rao: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఎక్స్ వేదికగా కేఆర్ఎంబీ మినిట్స్ ను పోస్టు చేసి ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న కాంగ్రెస్ సర్కార్.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నదని అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదు అన్నారు. నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారన్నారు. ఈ నెల 23న హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని మండిపడ్డారు.

నాడు బనకచర్ల.. నేడు పల్నాడు!

Advertisement

నాడు బనకచర్ల.. నేడు పల్నాడు! ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి మాత్రం మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అని నిలదీశారు. నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ .. అసలు రంగు బయటపడింది..నిజస్వరూపం బట్టబయలైంది.. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి చేస్తున్నది చారిత్రక ద్రోహం.. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఎల్‌నినో ఎఫెక్ట్.. 15 నెలల సన్నబియ్యం బఫర్ స్టాక్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Tags

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్.. 15 నెలల సన్నబియ్యం బఫర్ స్టాక్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ వేలంలో కీలక మలుపు.. హైకోర్టు మెట్లు ఎక్కిన వివాదం!

వేల ఎకరాలు అమ్ముకున్న మీరా.. ఇప్పుడు మాట్లాడేది? బీఆర్ఎస్‌పై అద్దంకి ఫైర్

హైదరాబాద్ దాహార్తికి చెక్.. మల్లన్నసాగర్ నీళ్లు వచ్చేశాయ్!

OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్.. 10వ తరగతి వరకు ఉచిత విద్య, అప్లై చేసుకోండిలా!

Big Stories

Advertisement
×