BigTV English
Advertisement

BRS: కేసీఆర్‌కు బ్రీఫింగ్!.. అఖిలేశ్ లంచ్ మీటింగ్.. ఏంటి సంగతి?

BRS: కేసీఆర్‌కు బ్రీఫింగ్!.. అఖిలేశ్ లంచ్ మీటింగ్.. ఏంటి సంగతి?
kcr akhilesh

BRS: దేశ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా.. విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. పాట్నాలో మీటింగ్ పెట్టి.. మనం మనం కలిసి పోటీ చేద్దామని డిసైడ్ అయ్యాయి. ఆ భేటీకి బీఆర్ఎస్‌కు ఆహ్వానమే లేదు. దీంతో.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్.. ఇక ఒంటరివారేననే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లింది.


విపక్షాల మీటింగ్‌లో బీఆర్ఎస్ ఎందుకు లేదో.. ఖమ్మం కాంగ్రెస్ సభలో వివరించి చెప్పారు రాహుల్‌గాంధీ. కొన్నిపార్టీలు కేసీఆర్‌ను పిలుద్దామని అన్నాయని.. అయితే బీఆర్ఎస్ హాజరయ్యే మీటింగ్‌కు కాంగ్రెస్ అటెండ్ కాదని తేల్చిచెప్పినట్టు రాహుల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీకి బీ టీమ్ అని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పార్టీతో కాంగ్రెస్ ఉండబోదని సూటిగా చెప్పారట. రాహుల్ రిజెక్షన్‌తో పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల భేటీకి కేసీఆర్‌కు ఇన్విటేషన్ రాలేదని రాహుల్ మాటలను బట్టి తెలుస్తోంది.

కట్ చేస్తే.. రాహుల్ సభ ముగిసిన మర్నాడే.. ఆ విపక్షాల మీటింగ్‌కు హాజరైన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్.. సడెన్‌గా హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యేక విమానంలో యూపీ నుంచి బేగంపేట్ వచ్చారు. ఆ స్పెషల్ ఫ్లైట్ ఎవరు అరేంజ్ చేశారో వేరే చెప్పనవసరం లేదు. మంత్రులు తలసాని, వేములలు.. విమానాశ్రయంకు వెళ్లి మరీ అఖిలేశ్‌ను రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌తో అఖిలేశ్ యాదవ్ లంచ్ మీటింగ్ జరిపారు.


ఇంతకీ అఖిలేశ్.. ఇంత అర్జెంట్‌గా కేసీఆర్‌ను ఎందుకు కలిసినట్టు? విపక్షాల భేటీలో జరిగిన కసరత్తును కేసీఆర్‌కు బ్రీఫింగ్ చేసేందుకే వచ్చారా? పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న కామన్ సివిల్ కోడ్ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వచ్చారా?

రాహుల్ అంతలా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌యేతర కూటమికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూటమిలో కీలకమైన నేతగా ఉంటున్న అఖిలేశ్.. ఇలా కేసీఆర్‌తో పదే పదే భేటీ కావడం వెనుక ఆంతర్యం ఏంటి? ఇటీవల ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు సైతం ఎస్పీ చీఫ్ హాజరయ్యారు. వారిద్దరి మధ్య అంత బంధం ఏంటి? అఖిలేశ్ యాదవ్‌కు అవసరం ఏర్పడినప్పుడల్లా కేసీఆరే డబ్బులు పంపుతున్నారనే ప్రచారం నిజమేనా? ఇలా అనేక రకాలుగా చర్చ నడుస్తోంది. కేసీఆర్, అఖిలేశ్ యాదవ్‌ల భేటీపై రాజకీయంగా ఫుల్ అటెన్షన్ నెలకొంది.

Related News

Jubilee Hills By-Election: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?

Kalvakuntla Kavitha: హరీష్‌ను టార్గెట్ చేస్తున్న కవిత

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Nizamabad: దందాలు మూసుకోండి.. బీజేపీ లీడర్లకు ధర్మపురి వార్నింగ్

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

German Scientists: గబ్బిలాలను వేటాడి తింటున్న ఎలుకులు.. కోవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌కు ఇదే నాందా?

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Big Stories

×