E-Paper
Advertisement

Allu Arjun –Trivikram Reunite : నాలుగోసారి క్రేజీ కాంబినేషన్ ఫిక్స్..

Allu Arjun –Trivikram Reunite : నాలుగోసారి క్రేజీ కాంబినేషన్ ఫిక్స్..
Advertisement
Allu Arjun –Trivikram Reunite

Allu Arjun –Trivikram Reunite : కొందరు హీరోలు, దర్శకులు కాంబో అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా హీరో ఫ్యాన్స్ కూడా మళ్లీ తమ అభిమాన నటుడు.. ఎప్పుడెప్పుడు ఆ దర్శకుడితో చేతులు కలుపుతాడా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్స్ తెలుగులో చాలానే ఉన్నాయి. అందులో ఒకటి త్రివిక్రమ్, అల్లు అర్జున్. గత కొన్నిరోజులుగా వీరు నాలుగోసారి కలిసి పనిచేయనున్నారని రూమర్స్ వినిపిస్తుండగా.. తాజాగా ఆ రూమర్స్ గురించి ఒక క్లారిటీ వచ్చేసింది.

Advertisement

అల్లు అర్జున్.. కెరీర్ మొదట్లో ఎన్ని విమర్శలను ఎదుర్కున్నాడో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’తో బన్నీ కూడా పాన్ ఇండియా స్టార్ల లిస్ట్‌లో చేరిపోయాడు. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ అందరికీ పుష్ప ఫీవర్ పట్టుకుంది. సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ స్టైల్, మ్యానరిజంను క్రికెటర్లు సైతం ఇమిటేట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో బన్నీ తరువాతి సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూడడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ అప్‌కమింగ్ సినిమాలపై పూర్తిగా క్లారిటీ లేదు. పుష్ప పార్ట్ 2 షూటింగ్‌లో బన్నీ పాల్గొంటున్నాడా లేదా అనే విషయంపై కూడా అప్డేట్ ఏమీ లేదు. పుష్ప పార్ట్ 2ను ఈ ఏడాది చివర్లో విడుదల చేస్తున్నారంటూ వార్తలు వచ్చినా అసలు షూటింగ్ జరుగుతుందో లేదో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. ఇంతలోనే అల్లు అర్జున్.. మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి సినిమా చేయనున్నాడు అనే వార్త వారిని సంతోషంలో ముంచేసింది. ఆ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది.

Advertisement

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చినవే. ఇందులో ఒకదానికి మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది ఈ కాంబినేషన్. ఇక వీరు ముచ్చటగా నాలుగోసారి కలిసి సినిమా చేయనున్నట్టు తాజాగా ఒక అనౌన్స్‌మెంట్ వీడియో బయటికొచ్చింది. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ చిత్రంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. ఆ మూవీ పూర్తయిన తర్వాత అల్లు అర్జున్‌తో చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×