BigTV English

Telangana News : బీసీలు సింహగర్జనకు రెడీ? కేసీఆర్‌కు ఇచ్చే అల్టిమేటం ఏంటి?

Telangana News : బీసీలు సింహగర్జనకు రెడీ? కేసీఆర్‌కు ఇచ్చే అల్టిమేటం ఏంటి?
Telangana News


Telangana News : బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలకు ఎదురుగాలి విస్తోందా? త్వరలో పార్టీలకు అతీతంగా బీసీలు భారీ ఎత్తున సింహగర్జనకు రెడీ అవుతున్నారా? మొన్నటి వరకు BRSకు మద్దతుగా నిలిచిన బీసీ సంఘాలు వచ్చేనెలలో కేసీఆర్‌కు ఇవ్వనున్న అల్టిమేటం ఏంటి? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌ అయింది. బీసీల మిషన్‌ 60 అల్టిమేటం బీఆర్ఎస్‌ సర్కార్‌కు గట్టి షాక్‌ ఇవ్వనుందా అనే టాక్‌ నడుస్తోంది.
బీసీలు బీసీ బంధు కోసం అప్లై చేసుకునే ఫైల్‌ విజువ్స్‌ కూడా వాడాలి

వెనుకబడిన వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు బీఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టేలా కనిపిస్తున్నాయి. తెరపైకి తెస్తున్న పథకాలపై కొండంత ప్రచారం చేసుకుంటుండగా.. అమలులోకి వస్తున్నది గోరంత మాత్రమే అనే విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందేందుకు ఇప్పటికే బీసీలకు ఆత్మగౌరవ భావనాల పేరిట కోకాపేటలో వీలువైన ప్రభుత్వ భూములను కేటాయించారు. నెలకిందట కుల వృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పేరిట తీసుకొచ్చిన కొత్త స్కిం పూర్తిగా అబాసు పాలైంది.


గడిచిన ఏడాది సెప్టెంబర్‌లో బీసీలకు బీసీ బంధు ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని బీఆర్ఎస్ నేతలు లీకులు ఇచ్చుకుంటూ వచ్చారు. తీరా సర్కార్ వద్ద సరిపడా డబ్బులు లేకపోవడంతో కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయంతో ట్రయల్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో దాదాపు ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకోగా మొదటి దశలో కేవలం 40 వేల మందిని ఎంపిక చేశారు. ఈనెల 15 నుంచి డబ్బులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. నిధుల కొరత కారణంగా మొదటి దశలో ఇవ్వబోయే 40 వేల మందితోనే ఈ పథకం ఆగిపోయే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో దళిత బంధు పథకం అమలు దగ్గర్నుంచి తాజాగా బీసీ బంధు వ్యవహారం కూడా ఇలాంటిదే అని తేలిపోయేలా ఉంది. దళిత బంధులాగే ఈ స్కీం కూడా శాంపిల్‌గా మారిపోనుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఆ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో బీసీలకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని త్వరలో భారీ ఎత్తున సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. మిషన్ 60 పేరిట ప్రజల్లోకి పార్టీలకు అతీతంగా వెళ్లాలని భావిస్తున్నారు బీసీ సంఘాల నేతలు. ఈసారి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతోపాటు కేసీఆర్ బీసీలకు సముచిత స్థానం కల్పించాలన్న ఉద్దేశ్యంలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు రెండు రోజుల క్రితం నగరంలోని ఓ హోటల్‌లో సమావేశం అయ్యారు. జనాభా దామషా ప్రకారం ప్రభుత్వం ఇప్పటి వరకు బీసీ కులగణన చేయక పోవడం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలో బీసీలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడం లాంటి అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతం కంటే ఇప్పుడు బీసీల సంఖ్య భారీగా పెరగడంతో కనీసం 60 స్థానాల్లో టికెట్లు ఇవ్వాలనే డిమాండ్ కేసీఆర్ ముందు ఉంచాలని బీసీ సంఘాల నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. మరోవైపు బీసీ బంధుకు మరోసారి అప్లికేషన్లు తీసుకోవాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతోపాటు కేసీఆర్‌కు లేఖలు రాయనున్నారు బీసీ సంఘాల నేతలు. వెనుకబడిన వర్గాల ఐక్యతను చాటెలా ఆగస్టులో ఐదు లక్షల మందితో బీసీ సింహ గర్జన పేరిట భారీ ఎత్తున సభను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌కు బీసీలు అల్టిమేటం ఇస్తే ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×