E-Paper
Advertisement

గ్రామ పంచాయతీలో మ్యారేజ్ సర్టిఫికెట్ల దందా.. పెళ్లి కాకపోయినా సర్టిఫికేట్ జారీ..!

గ్రామ పంచాయతీలో మ్యారేజ్ సర్టిఫికెట్ల దందా.. పెళ్లి కాకపోయినా సర్టిఫికేట్ జారీ..!
Advertisement

Marriage Fraud: స్వేచ్ఛ బ్యూరో: తొర్రూరు మండలంలోని కర్కాల గ్రామపంచాయతీలో పనిచేసిన కార్యదర్శి కె. ప్రభు అక్రమాల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తన పదవీకాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వివాహ నమోదుల్లో తీవ్ర లోపాలు, అవకతవకలు జరిపినట్లు ఆరోపించారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీ పరిధిలో అసలు పెళ్లి జరగకపోయినా మ్యారేజ్ రిజిస్టర్‌లో తప్పుడు తేదీ నమోదు చేసి, 26 రోజుల వ్యత్యాసంతో ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు వెల్లడించారు.

నియమాలకు విరుద్ధంగా..

ఇదే సమయంలో గ్రామంలో నిజంగా జరిగిన రెండు వివాహాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేయకుండా వదిలేసినట్లు తెలిపారు. అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ నంబర్లు, సీరియల్ నంబర్లను నియమాలకు విరుద్ధంగా తన ఇష్టానుసారం నమోదు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గలాబీలో ఇప్పుడిదే హట్ టాపిక్..?

మరోసారి వినతి పత్రం

దీంతో సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌కు మరోసారి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యదర్శి ప్రభుపై సమగ్ర విచారణ చేపట్టి, శాఖాపరమైన చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ఈ తరహా ఘటనలను సహించరాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Also Read: రేపటి నుంచే ఏపీలో నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలు!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×