E-Paper
Advertisement

అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గులాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?

అనుకున్నది ఒకటి అయినది మరొకటి.. గులాబీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..?
Advertisement

BRS Criticism: స్వేచ్ఛ బ్యూరో: బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకబడింది. కేవలం ప్రభుత్వంపై మాటల దాడికే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. సభ జరిగినన్ని రోజులు కేవలం మీడియా ఫోకస్ పెట్టారు తప్ప క్షేత్రస్థాయిలోని సమస్యలపై దృష్టిసారించలేదనే ప్రచారం జరుగుతుంది. పోటీపడి ప్రభుత్వంపై విమర్శలు తప్ప అన్ని రంగాల ప్రజలు, క్షేత్రస్థాయిలో ఇబ్బందులపై మాట్లాడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. రెండురోజూలు మంత్రి పొంగులేటి, కౌశిక్ రెడ్డి అంశాలపై నే చర్చజరుగుతుండటం, పార్టీ సభ్యులు సైతం కొంతమంది నామమాత్రంగానే సభకు హాజరుకావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది.

సమస్యలపై స్పందన..

బీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ప్రజల్లో ఆశ ఉండేది. అసెంబ్లీ సమావేశాలు జరిగితే క్షేత్రస్థాయిలోని సమస్యలు ప్రస్తావిస్తారని, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి, రైతు, ఇలా అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులపై మాట్లాడతారని ఆశగా ఎదురుచూశారు. కానీ ఆ స్థాయిలో బీఆర్ఎస్ సమస్యలపై ప్రస్తావించలేదని విమర్శలు ఊపందుకున్నాయి. బడ్జెట్ సమావేశాలు 10 రోజుల పాటు జరిగాయి. కానీ ఏ రోజు సైతం పూర్తిస్థాయిలో సమస్యలపై బీఆర్ఎస్ సభ్యులు ప్రస్తావించలేదనే ప్రచారం జరుగుతుంది. సమావేశాలు జరిగినన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ గన్ పార్కు వద్ద నిరసనలు, సభలో నినాదాలకు మాత్రమే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి.

కేడర్‌లో తీవ్ర చర్చ..

Advertisement

అధికార కాంగ్రెస్ పార్టీ కన్నా గులాబీకే మైలేజ్ రావాలని చేసినట్లు స్పష్టమవుతుంది. ప్రతి రోజూ ఏదో ఒక అంశంపై నిరసనలు చేపట్టారు కానీ అసెంబ్లీ వేదికగా మాత్రం ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో నిలదీయలేకపోయిందని, ఒకటిరెండ్రోజులు మాత్రమే ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్ రావులు పై చెయ్యి సాధించారని, మిగతా రోజులంతా గళం వినిపించలేకపోయారని కేడర్ లోనే చర్చజరుగుతుంది. ఎప్పుడైనా బడ్జెట్ సమావేశాలు జరిగితే సభ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున బెట్టే ప్రయత్నం చేసేంది. వచ్చిన ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునేది. అయితే ఈసారి మాత్రం అందుకు రివర్స్ అయింది. కేవలం మీడియా ఫోకస్ మీదనే పెట్టిందని, ప్రజాసమస్యలను గాలికి వదిలేశారనే ప్రచారం జరుగుతుంది.

Also Read: చెత్త వేయొద్దంటూ జనాల కాళ్లు మొక్కిన జీహెచ్ఎంసీ సూపర్‌వైజర్, ఇకనైనా మారండ్రా!

రాజీనామాకు డిమాండ్..

Advertisement

ఇది ఇలా ఉంటే మైనింగ్ పై శనివారం బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు మాట్లాడారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. హౌజ్ కమిటీకి పట్టుబడటం.. ప్రభుత్వం సీబీసీఐడీ ఎంక్వాయిరీ వేస్తామనడం.. అందుకు బీఆర్ఎస్ ససేమీరా అనడం.. మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని కోరడం.. స్పీకర్ ఇవ్వకపోవడం ఇదంతా జరిగింది. ఆదివారం సైతం మంత్రి పొంగులేటి రాజీనామాకు డిమాండ్ చేయడం.. రాఘవా కన్ స్ట్రక్షన్ పై చర్యలకు పట్టుబటం.. మరోవైపు కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియం శ్రీహరి అంశం తెరమీదకు రావడం.. మధ్యాహ్నం వరకు ఇదే చర్చజరుగడం.. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద బైఠాయింపు.. సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేందుకు గులాబీ స్కెచ్ వేస్తే అధికార కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇదంతా చూసిన పార్టీ కేడర్ సైతం అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి అంటూ గుసగుసలాడుతున్నారు.

గళం ఎత్తుతారా..?

బడ్జెట్ పై పూర్తి స్థాయిలో మాట్లాడకపోవడం, ప్రజాసమస్యలపై సైతం ప్రస్తావించకపోవడంతో పార్టీ కేడర్ నిరాశకు గురవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు సైతం గ్యారెంటీలు, హామీలపై మాట్లాడతారని అమలుకు పట్టుబడతారని భావించినప్పటికీ వారు సైతం నిట్టూరుస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సభ్యులు సభకు సైతం పూర్తి స్థాయిలో రాలేదు. ఒకరు సభలోకి రావడం.. వచ్చినవారు సైతం పూర్తి స్థాయిలో కూర్చోకపోవడం.. వచ్చినవారు సైతం ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టేలా మాట్లాడటం లేదనే ప్రచారం జరుగుతుంది. కేవలం నామమాత్రంగానే మాట్లాడారని.. బీఆర్ఎస్ పై పెట్టుకున్న అంచనాల స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయలేదనే విమర్శలు వస్తున్నాయి. రాబోయే సమావేశాల్లోనైనా బీఆర్ఎస్ పై ప్రజలు ఆశించిన స్థాయిలో ప్రభుత్వంపై గళం ఎత్తుతారా? అనేది ఎదురుచూస్తున్నారు.

Also read: 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కన్నీటి కృతజ్ఞతలు.. ఎందుకంటే..?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×