TG Medical Corporation: స్వేఛ్చ బ్యూరో: నార్త్ స్టేట్స్ కాంట్రాక్టర్లపై మెడికల్ కార్పొరేషన్ అత్యంత ప్రేమ చూపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మహరాష్ట్ర కాంట్రాక్టర్లకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్,ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెద్దపీఠ వేస్తుందని ప్రచారం జరుగుతుంది. క్వాలిటీ లేని ఫర్నిచర్ సప్లై చేస్తున్నా పట్టించుకోవడం లేదని సమాచారం. అంతేగాక భారీ స్థాయిలో ఏకంగా రూ.15 కోట్లు ఫర్నిచర్ సప్లై చేసిన కంపెనీలకు ఒకే సారి నిధులు రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం.వాస్తవానికి మహారాష్ట్ర కు చెందిన ఫర్మిచర్ క్వాలిటీ లేదని ఇప్పటికే మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర ఆఫీసర్లు కార్పొరేషన్ కు ఫిర్యాదు చేసినా..పట్టించుకోవడం లేదు. ఈ కంపెనీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సివిల్ కాంట్రాక్టర్లకు ఏకంగా పదిహేను కోట్లు చొప్పున చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోకల్ కంపెనీలకు బడ్జెట్ లేదని సాకులు చెబుతున్న మెడికల్ కార్పొరేషన్ ఆఫీసర్లు.. నార్త్ స్టేట్ కంపెనీలకు భారీ స్థాయిలో నిధులను కేటాయించడంతో విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో కార్పొరేషన్ ఆఫీసర్లు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వైద్యారోగ్యశాఖ లో చర్చంశనీయంగా మారాయి.
వివిధ ఆసుపత్రులకు ఫర్నిచర్ సప్లై చేసేందుకు మహరాష్ట్రకు చెందిన సామర్ స్టీల్ ఇండస్ట్రీస్, జీనత్ ఇండస్ట్రీస్ లు మెడికల్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు దక్కించుకున్నాయి.గత ఏడాది ఆ కంపెనీలకే కాంట్రాక్ట్ దక్కేలా టెండర్ లో స్పెసిఫికేషన్లు పెట్టినట్లు విమర్శలూ కూడా వచ్చాయి. కానీ అధికారులు కుమ్మక్కుతో ఆ కంపెనీలకు టెండర్ దక్కినట్లు స్వయంగా మెడికల్ కార్పొరేషన్ లో నే చర్చ జరుగుతుంది.ఈ కంపెనీల నుంచి మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులకు ఫర్నిచర్ సప్లై అవుతుంది. మెడికల్ కాలేజీల్లో స్టూడెంట్ల టేబుల్స్, అడ్మినిస్ట్రేషన్ ఫర్నిచర్, క్లాస్ రూమ్స్ మెటీరియల్స్ , ఆసుపత్రుల్లో బెడ్స్, బల్లలు, తదితరవన్నీ సప్లై చేయాల్సి ఉంటుంది. గత ఏడాది క్రితం నుంచి ఈ కంపెనీలను కొందరు ఆఫీసర్లు ప్రత్యేకంగా తీసుకువచ్చినట్లు కార్పొరేషన్ లో ప్రచారం జరుగుతుంది. అంతకంటే ముందు లోకల్ కంపెనీలే ఈ ఫర్నిచర్ ను సప్లై చేశాయి. సంవత్సరం క్రిందట నుంచి మాత్రం నార్త్ కంపెనీలకు కాంట్రాక్ట్ లు ఇచ్చి కార్పొరేషన్ విమర్శల పాలవుతున్నది.
మహరాష్ట్ర కంపెనీలకు చెందిన ఫర్నిచర్ నాసిరకంగా ఉన్నాయని నిత్యం ఆసుపత్రుల అధికారుల నుంచి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. నాణ్యత లేని డ్యూయల్ డిస్కస్ లు, ఆఫీస్ టేబుల్స్, మంచాలతో పాటు వివిధ రకాల ఫర్నిచర్‌లో సమస్యలు ఉన్నట్లు గతంలోనే ఆఫీసర్లు గుర్తించారు. కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలుస్తున్నది. సర్కార్ స్పెసిఫికేషన్ ప్రకారం ఆఫీస్ టేబుళ్లకు కీ బోర్డు ట్రే ఉండాలి. కానీ అలాంటివి ఇవ్వడం లేదు. అంతేగాక డ్రా సైజు చాలా చిన్నదిగా పెట్టారు. ఇన్ ఫెక్షన్ ఆఫీసర్లుకూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. ఇక డ్యూయల్ డెస్క్ ల లెగ్స్ కు బుష్ ఉండాలి. జాయింట్ పుల్ వెల్డింగ్ ఉండాలి. పుల్ బుక్ షెల్స్ ఉండాలి. కానీ మహారాష్ట్ర సప్లైయర్ మాత్రం మొత్తం స్క్రూలతో మాత్రమే ఫిట్ చేసి, బుక్ షెల్ప్ కు సగం సీట్ మాత్రమే పెట్టి వదిలేశారు.
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మంచాల విషయంలో స్పెసిఫికేషన్ ప్రకారం షీట్ 18 గేజ్ ఉండాలి. కానీ సరఫరా చేసినవి ఏకంగా 22 గేజ్ ఉన్నాయి. దాంతో మంచంలో సుమారు 10 కిలోలా బరువు తేడా వస్తున్నట్లు స్వయంగా కార్పొరేషన్ లోని ఓ అధికారి ఆఫ్ ది రికార్డులో చెప్పారు. ఈ లెక్కన ఆ కంపెనీ సప్లై చేసే ప్రతీ వస్తువూ నాసిరకంగానే ఉంటుందనేది అంచనా వేయొచ్చు. ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ థర్డ్ ఫార్టీ ఇన్ స్పెక్షన్స్ జరగడం లేదు. ఎలాంటి తనిఖీలు చేయకుండానే బిల్లులు చెల్లిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేవలం ఫర్నిచర్ హైట్, వెడల్పు, డెప్తు సైజులు కొలిచి, ఇన్ స్పెక్షన్ ఆఫీసర్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నానే విమర్శలు కూడా వస్తున్నాయి. స్పెసిఫికేషన్ చూడకుండా క్లియరెన్స్ ఇస్తునట్లు తెలిసింది.
Also Read: Kalki 2: కల్కి 2 లో సుమతిగా సాయి పల్లవి.. రూమర్లపై స్పందించిన మూవీ టీమ్!