E-Paper
Advertisement

Medaram Jathara 2026: రెండున్నర కోట్ల మంది భక్తుల రాక.. విపక్షాల ప్రశంసలే మాకు నిదర్శనం.. మంత్రి సీతక్క

Medaram Jathara 2026: రెండున్నర కోట్ల మంది భక్తుల రాక.. విపక్షాల ప్రశంసలే మాకు నిదర్శనం..  మంత్రి సీతక్క
Advertisement

Medaram Jathara 2026: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సచివాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర విశేషాలను, భవిష్యత్ ప్రణాళికలను ఆమె పంచుకున్నారు.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతర ఈ సారి అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిసిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జాతర నిర్వహణ , గుడి పనులు సజావుగా సాగాయని.. భక్తులకు కల్పించిన సౌకర్యాల పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లును చూసి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

Advertisement

జాతర ప్రారంభ సమయంలో కొంతమంది ఏర్పాట్లపై కావాలనే విష ప్రచారం చేశారని సీతక్క మండిపడ్డారు. ఒక చిన్న దొంగతనం ఘటనను భూతద్దంలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారని.. వాస్తవానికి భక్తుల రక్షణ కోసం పకడ్బందీ చర్చలు తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. కేవలం ఒటి రెండు రోజుల్లో తిరుగు జాతర పూర్తి కావడంతో ఈ ఘట్టం ముగియనుంది.

ఈ జాతరలో ఒక విశేష మార్పును గమనించామని మంత్రి తెలిపారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా హైక్లాస్ ప్రజలు సైతం వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు ఈ వేడుకకు హాజరైనట్లు అంచనా వేస్తున్నాం అని ఆమె పేర్కొన్నారు. అదే విధంగా భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్కలు తలెత్తుకుండా మేడారం చుట్టుపక్కల వెడల్పు చేస్తామని.. వచ్చే జాతర సమయానికి కొత్త రోడ్లను అందుబాటులోకి తెస్తామని మంత్రి హామి ఇచ్చారు. అలాగే.. త్వరలో జరగనున్న పుష్కరాల నిర్వహణపై ములుగు జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేస్తామని సీతక్క వివరించారు.

Advertisement

Also Read: లైంగిక వేధింపుల ఆరోపణలు.. జనసేన ఎమ్మెల్యేను ఉతికి ఆరేసిన త్రీమెన్ కమిటీ!

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×