E-Paper
Advertisement

Anil: షర్మిల ఇలా.. అనిల్ అలా.. వారికే క్లారిటీ లేదా?

Anil: షర్మిల ఇలా.. అనిల్ అలా.. వారికే క్లారిటీ లేదా?
Advertisement

Anil: వైఎస్సార్ టీపీ పేరుతో షర్మిల తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు. పార్టీ పెట్టి.. పాదయాత్ర చేస్తూ.. ప్రజల్లో ఉంటున్నారు. కేసీఆర్ సర్కారుపై విమర్శలు చేయడమే ఆమె పని. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ.. ప్రజల్లో తిరుగుతూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కేసీఆర్ దళితులను మోసం చేశారని, సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని, అవినీతి అక్రమాలతో గులాబీ నేతలు దోచుకుంటున్నారని.. ఎక్కడికెళితే అక్కడ ఇవే ఆరోపణలు. పనిలో పనిగా స్థానిక నేతలనూ టార్గెట్ చేస్తుంటారు షర్మిల. తెలంగాణలో పాలన అసలేమాత్రం బాగోలేదనేది ఆవిడ అభిప్రాయం.

కట్ చేస్తే, లేటెస్ట్ గా షర్మిల భర్త అనిల్ కుమార్.. ఏపీలోని విశాఖ జిల్లా భీమిలిలో సువార్త సభకు హాజరయ్యారు. పరోక్షంగా అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏపీ సీఎం జగన్ తనకు బావ అయినప్పటికినీ, ప్రస్తుతం ఆ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు లేవు. అన్నపై కోపంతోనే షర్మిల తెలంగాణకు వచ్చేసి ఇక్కడ రాజకీయ దుకాణం తెరిచారని అంటారు. అందుకే, బ్రదర్ అనిల్ కుమార్ సైతం ఏపీ సర్కారును పలుమార్లు టార్గెట్ చేస్తూ మాట్లాడారు.

Advertisement

ఈసారి అనిల్ చేసిన కామెంట్లు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. భీమిలిలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో పుట్టినా బాగుండనే భావన ప్రజల్లో ఏర్పడిందని అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

ఏపీకి పక్క రాష్ట్రాలు అంటే.. తెలంగాణ గురించే అనిల్ అలా అన్నారని అంటున్నారు. అంటే, ఏపీ ప్రజలు ఆ రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండని అనుకుంటున్నారంటే.. తెలంగాణలో పాలన బాగుందనేగా అనిల్ ఉద్దేశమని అంటూ తమదైన భాష్యం చెబుతున్నారు. మరి, తెలంగాణలో పుట్టాలని ఏపీ ప్రజలు కోరుకుంటుంటే.. అనిల్ భార్య షర్మిల మాత్రం తెలంగాణలో పాలన అధ్వాన్నంగా ఉందంటూ ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. భార్య ఇలా.. భర్త అలా..? ఎందుకలా? వారి మధ్యే క్లారిటీ లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

Advertisement

అయితే, అనిల్ మాట్లాడింది తెలంగాణ గురించి కాకపోవచ్చని.. ఏపీకి పక్క రాష్ట్రాలు అంటే తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలు కూడా ఉన్నాయిగా అని గుర్తు చేస్తున్నారు. అనిల్ ఉండేది తెలంగాణలో. ఆయన తరుచూ చేసే పర్యటనలు ఏపీ, తెలంగాణలో మాత్రమే. అందుకే, ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల గురించే అవగాహన ఉండే అవకాశం ఉంటుంది కానీ.. తమిళనాడు, ఒడిశా, కర్ణాటకల గురించి అనిల్ కు అంతగా క్లారిటీ ఉండకపోవచ్చని అంటున్నారు. సో, అనిల్ మాట్లాడింది ఏపీ, తెలంగాణల గురించేనని తేల్చేస్తున్నారు. ఇలా, అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు షర్మిలకు రాజకీయంగా ఇబ్బంది కలిగించేవే.

Related News

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

Big Stories

Advertisement
×