BigTV English

Malla Reddy : మల్లారెడ్డికి మళ్లీ నిరసన సెగ.. ఆ గ్రామస్తుల ఆందోళన.. ఎందుకంటే?

Malla Reddy : మల్లారెడ్డికి మళ్లీ నిరసన సెగ.. ఆ గ్రామస్తుల ఆందోళన.. ఎందుకంటే?
Malla Reddy


Malla Reddy : మంత్రి మల్లారెడ్డి. నిత్యం న్యూస్‌లో ఉండే లీడర్. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. పాలమ్మిన, పూలమ్మిన అంటూ.. మజామజా మాటలు చెప్పడమే కాదు.. డ్యాన్సులు గట్రా చేస్తూ సందడి చేస్తుంటారు. అయితే, ఆయన ఎంత కామెడీగా కనిపిస్తారో.. తెర వెనుక అంత ఖతర్నాక్ అని కూడా అంటారు. భూకబ్జాలు, వ్యతిరేకులను తొక్కేయడం తదితర పనుల్లో బాగా ఆరితేరారనే ఆరోపణ ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే మల్లారెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టి.. మీటింగులు పెట్టుకున్నారంటే.. మంత్రి గారి టార్చర్ ఎలా ఉంటుందో అర్థమవుతోంది. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలనే లెక్క చేయని మల్లన్న.. ఇక జిల్లా ప్రజలను పట్టించుకుంటారా? వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారా? అందుకే, ఇటీవల ఆయన ఎక్కడికి వెళ్లినా.. అక్కడ ప్రజల నుంచి నిలదీతలే ఎదురవుతున్నాయి.

మంత్రి మల్లారెడ్డికి మళ్లీ నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్‌లో మల్లారెడ్డి పర్యటిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అయితే తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళితే.. మల్లారెడ్డి తమపైకే కారు ఎక్కించమన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు కాకపోతే.. తమ సమస్యలు ఇంకేవరికి చెప్పుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. స్థానిక ఎమ్మెల్యే కాకపోతే.. ఇంకేవరు తమ సమస్యలు పరిష్కరిస్తారని నిలదీశారు. మల్లారెడ్డి తీరును నిరసిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని చెదరగొట్టారు.


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×