Big Stories

Another shock to BRS: బీఆర్‌ఎస్‌కు మరో షాక్, కారులో ఉక్కపోత.. దిగిపోతున్న నేతలు

BRS party latest news(Telangana news today): తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి ఏంటి? షెడ్‌కు వెళ్లిన కారు బయటకు వస్తుందా? బయటకు రాదని ఖరాఖండిగా చెబుతున్నారు నేతలు. ఆ పార్టీ పనైపోయిందని ఒక్కముక్కలో తేల్చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజుల నుంచి కారు పార్టీకి చెందిన ఇళ్లను చక్కబెట్టుకోవడం మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోవడం మొదలైంది.

- Advertisement -

మారుతున్న రాజకీయాలకు అనుగుణంగా లేకుంటే తమ పొలిటికల్ ఛాప్టర్ క్లోజ్ అవుతుందని భావించిన నేతలు కండువాలు మార్చుకుంటున్నారు. ఈ విషయంలో బాగా నష్టపోయిన పార్టీలో బీఆర్ఎస్ ఒకటి. ఇప్పటికే ఆ పార్టీకి చాలామంది ఎమ్మెల్యేలు, మాజీలు రాంరాం చెప్పేశారు. ఇక జిల్లాల పరిస్థితి చెప్పనక్కర్లేదు.

- Advertisement -

తాజాగా కొండాపూర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ షేక్ హమీద్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా హమీద్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరికొందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు లేకపోలేదు. ముఖ్యంగా జిల్లా జెడ్పీటీసీలతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఈ జాబితాలో ఉన్నారట. ఈ లెక్కన గ్రేటర్ ఎన్నికల లోపు కారు పార్టీ దాదాపుగా ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News