Big Stories

Mallikarjun Kharge: మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే: ఖర్గే

Mallikarjun Kharge Comments(Politics news today India): మోదీ మరో ఐదేళ్లు అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఝూర్ఖండ్ లోని జాంజ్గిర్-చంపా లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల హక్కులు కాలరాయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ 400 సీట్లు కోరుకుంటుందని ఆయన అన్నారు. ఇండియా కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తుందన్న ఫ్రస్ట్రేషన్ లో మోదీ ఉన్నారని.. అందుకే మంగళసూత్రాలు, ముస్లింల గురించి మాట్లాడుతున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు.

- Advertisement -

‘ముస్లింల గురించే మోదీ ఎందుకు మాట్లాడుతున్నారు.. ముస్లింలు కూడా ఈ దేశానికి చెందినవాళ్లే. పేద కుటుంబాల్లో పేదరికం కారణంగా సంతానం ఎక్కువగానే ఉంటుంది. మోదీ ప్రకటనలను ఎవరూ పట్టించుకోవొద్దు. అందరినీ కలుపుకుని వెళ్తేనే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది’ అని మల్కికార్జున ఖర్గే అన్నారు.

- Advertisement -

అదేవిధంగా ఇటు రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షాపై తీవ్ర స్థాయిలో ఫైరయిన విషయం విధితమే. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని.. అయితే, రిజర్వేషన్లను రద్దు చేయడం, రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు.. కానియ్యబోమంటూ ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.

Also Read: మరో లిస్ట్‌ను విడుదల చేసిన కాంగ్రెస్.. అందులో ఆ 2 సీట్లు తప్ప మిగతా..

అయితే, ఏప్రిల్ 21న ప్రధాని మోదీ రాజస్థాన్ లోని బాంస్వాడాలో ప్రసంగిస్తూ.. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఓ ప్రసంగాన్ని ఆధారంగా చేసుకుని, ముస్లింలపై కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పక్షాల నేతలు ప్రధాని మోదీ మాటలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News