BigTV English

Deepthi Jeevanji : వరంగల్ ముద్దుబిడ్డకు అర్జున అవార్డ్.. సీఎం రేవంత్ వరాల జల్లు

Deepthi Jeevanji : వరంగల్ ముద్దుబిడ్డకు అర్జున అవార్డ్.. సీఎం రేవంత్ వరాల జల్లు

Deepthi Jeevanji – CM Revanth Reddy : పారాలింపిక్స్ లో సత్తా చాటి భారత్ కు కాంస్య పతకం సాధించిన వరంగల్ యువతి పారా అథ్లెట్ జీవాంజి దీప్తికి (Deepthi Jeevanji) కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో (Arjuna Award) సత్కరించింది. తాజాగా ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో(National Sports Awards) ఇటీవల దేశానికి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించి, దేశ గౌరవాన్ని పెంచిన వివిధ విభాగాల్లోని అధ్లెట్లను గౌరవిస్తూ.. క్రీడా పురస్కారాలు ప్రకటించగా.. అందులో తెలంగాణకు చెందిన జీవాంజి దీప్తీని చోటు కల్పించింది.


గతేడాది ఆగష్టు – సెప్టెంబర్ మధ్య పారిస్ లో నిర్వహించిన పారాలింపిక్స్ లో(paris Paraolampics) భారత్ తరఫున 400 మీటర్ల టీ-20 పరుగు పందెంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించింది. ఈ కేటగిరీలో పతకం సాధించిన మొట్టమొదటి పారా అథ్లెట్ గా జీవాంజీ దీప్తీ గుర్తింపు సాధించింది. కాగా.. ఆమె కృషికి గుర్తింపుగా కేంద్రం తాజాగా అర్జున అవార్జును ప్రకటించింది. కాగా.. ఈ నెల 17న రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము(*Draupati Murmu) చేతుల మీదుగా ఈ అవార్డును అందించనున్నారు. విశిష్ట క్రీడా పురస్కారం ప్రకటనతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. కేంద్రం న‌లుగురికి ఖేల్‌ర‌త్న‌, 32 మందికి అర్జున అవార్డులను ప్రకటించగా.. మరో ఐదుగురికి ద్రోణాచార్య అవార్డుల‌ ప్రకటించింది.

రేవంత్ రెడ్డి అభినందనలు
జీవాంజీ దీప్తికి కేంద్ర క్రీడా అవార్డు రావడంతో స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజికి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు రావడం సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి.. ఆమెకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహకాల్ని ప్రకటించారు.


జీవాంజి పతకం సాధించినప్పుడే స్పందించి.. రూ. 1 కోటి రూపాయల ప్రోత్సాహం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కోచ్ నాగపురి రమేష్ కి రూ.10 లక్షల నగదు బహుమతిని గతంలోనే అందజేశారు. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా మరిన్ని ప్రోత్సహకాల్ని అందజేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దీప్తికి గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం కేటాయించాని నిర్ణయించారు.

Also Read :  తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రైతు భరోసా దరఖాస్తుకు సిద్దం కండి

తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ (Young India Sports University), రాష్ట్రంలో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్సులు(Sports Comples) అందుకు దోహదపడతాయని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే.. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మనుబాకర్.. లకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. 2024 లో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలియజేశారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×