BigTV English

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..

AP Govt: ఏపీలో రెట్టింపు సాయంకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. తక్షణం అమల్లోకి..

AP Govt: తీరంలోకి వెళ్తేనే వారి పూట గడిచేది. తీరాన్ని నమ్ముకున్న కుటుంబాలు అవి. చేపలు పట్టడం, వాటిని విక్రయించడం ఇదే వారి ఉపాధి. సముద్రాన్ని నమ్ముకున్న ఆ కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదికూడ వారికి అందించే సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. అంతేకాకుండా రెట్టింపు సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇంతకు ఏంటా సాయం తెలుసుకుందాం.


ఏపీలోని తీరప్రాంతాల్లో ఎందరో మత్స్యకారులు చేపల వేటనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. తీరంలో చేపల వేట అంటేనే, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సిందే. చేపల వేటకు వెళ్లనిదే వారికి ముద్ద పోదు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కృష్ణా ఇలా పలు జిల్లాలలో మత్స్యకారులు ఉన్నారు. ప్రతిరోజూ వేటకు వెళ్ళడం, చేపలు పట్టడం, వాటిని విక్రయించడం వీరి దినచర్య. వీరు చేపల వేటకు విరామం ప్రకటిస్తే చాలు, వీరికి ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వీరికి సాయం అందిస్తుంది.

సాధారణంగా తీరంలో ఫిషింగ్ హాలీడేని ప్రతి ఏడాది విధిస్తారు. ఆ సమయంలో తీరంలోని చేపల సంతానోత్పత్తి జరుగుతుంది. ఏప్రిల్ 14 నుండి జూన్ 14 వరకు ఫిషింగ్ హాలీడే ప్రకటిస్తారు. ఆసమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశిస్తుంది. 61 రోజులు వేటకు విరామం ప్రకటిస్తే, మత్స్యకారులకు ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. అందుకే ప్రభుత్వం వారికి ఫిషింగ్ హాలిడే సమయంలో ఆర్థిక సాయం అందిస్తుంది.


Also Read: AP Schemes: విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 15 వేలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

గతంలో మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సంధర్భంగా రూ. 10 వేలు సాయం అందేది. ఆ సాయం తమకు సరిపోవడం లేదని, రూ. 20 వేలు అందించాలని మత్స్యకారుల డిమాండ్. ఈ డిమాండ్ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫిషింగ్ హాలిడే సమయంలో మత్స్యకారులకు అందించే సాయాన్ని పెంచుతూ, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుండి మత్స్యకారులకు అందించే సాయం రూ. 20 వేలు అందనుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎన్నాళ్ల నుండి వినిపిస్తున్న తమ డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×