Army Vehicle: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. అల్లావాడ గేట్ సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే..
14 మంది సైనికులతో ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం చేవెళ్ల మండలం అల్లావాడ గేట్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనంలోని జవాన్లందరికీ గాయాలయ్యాయి. శబ్దం విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు.
ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో వాహనంలోని 14 మంది జవాన్లు గాయపడగా.. వారిలో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. 108 అంబులెన్స్‌ల సాయంతో క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చేవెళ్లలో ఆర్మీ వాహనం బోల్తా
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని అల్లా వాడ గేట్ సమీపంలో ఆర్మీ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో ఎనిమిది మందికి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.… pic.twitter.com/EHVGzasMs1
— BIG TV Breaking News (@bigtvtelugu) November 13, 2026
ట్రాఫిక్‌కు అంతరాయం
ప్రమాదం కారణంగా చేవెళ్ల రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి వాహనాన్ని పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. వాహనం అదుపుతప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Also Read: రాహుల్‌ను రీలాంచ్ చేయాల్సిన అవసరం లేదు.. ఆయనో గొప్ప జననేత: మహేష్ కుమార్ గౌడ్