E-Paper
Advertisement

Congress: రేవంత్ ఎంట్రీ.. ఆ నలుగురు అరెస్ట్..

Congress: రేవంత్ ఎంట్రీ.. ఆ నలుగురు అరెస్ట్..
Advertisement

Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. హాత్ సే హాత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. కాంగ్రెస్ కేడర్‌లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ జోష్‌ను ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారు. రేవంత్ ర్యాలీకి హాజరైన యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై కొందరు దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు తోట పవన్. ఈ దాడి బీఆర్ఎస్ గుండాల పనేనంటూ మండిపడింది కాంగ్రెస్.

తోట పవన్‌పై దాడి విషయం తెలిసి హాస్పిటల్‌కి వెళ్లి పరామర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. పవన్‌కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరంగల్ సీపీ రంగనాథ్‌ను కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ వెంట సీతక్క, కొండా సురేఖ, కొండా మురళి, రాజయ్య, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు తరలివచ్చారు.

Advertisement

అటు, NSUI నేతలు హైదరాబాద్‌లో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హనుమకొండ కమిషనరేట్‌ ముందు సైతం విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇలా ఓ కార్యకర్తకు అండగా కాంగ్రెస్ శ్రేణులంతా ముందుకు రావడం ఆసక్తికరం. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు నేతలు. ఘటన జరిగిన హనుమకొండలో.. అటు హైదరాబాద్‌లో ఒకేసారి ఒత్తిడి పెంచడంతో పోలీసులు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. తోట పవన్‌పై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారు పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×