BigTV English

Summer: ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండ.. సమ్మర్ సెగ మొదలైందా?

Summer: ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండ.. సమ్మర్ సెగ మొదలైందా?

Summer: మొన్ననే శివరాత్రి అయింది. శివరాత్రికి శివ శివ అంటూ చలికూడా వెళ్లిపోయింది. అప్పుడే ఎండ మండుతోంది. పగటి పూట బయటకు వస్తే.. ఎండ మంట సుర్రున తగులుతోంది. మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ కాస్త బెటర్‌గా ఉంటున్నా.. మధ్యాహ్నం ఎండే కాలిపోతోంది. ఆ ఎండను చూసి అప్పుడే వేసవికాలం వచ్చేసిందా? అనే అనుమానం మొదలైంది. అదేంటి, ఫిబ్రవరిలోనే ఎండ మండిపోవడం ఏంటనే చర్చ స్టార్ట్ అయింది. మరి, సైంటిస్టులు ఏమంటున్నారంటే….


పర్వత ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతో పాటు, పొడి వాతావరణం ఉండటం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయట. ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు, మధ్యధరా ప్రాంతంలో తుపానులు లేకపోవడం కూడా టెంపరేచర్ పెరగడానికి ఓ కారణం అంటున్నారు. గుజరాత్‌లో యాంటీ సైక్లోన్లు ఏర్పడి.. సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయని ఇదికూడా రీజనేనని చెబుతున్నారు.

అయితే, ప్రస్తుతం ఉన్న ఎండ వేడి ఎన్నో రోజులు ఉండదంటూ భరోసా ఇస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, సాధారణం కంటే ఎక్కువగానే టెంపరేచర్ నమోదవుతుందని అంటున్నారు. వేసవికాలం ముందుగా వచ్చిందని ఇప్పుడే చెప్పలేమని.. ప్రస్తుత ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభానికి సంకేతాలు కావనేది సైంటిస్టుల మాట.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×