E-Paper
Advertisement

MP Arvind: సీఎం రేవంత్‌కు ఎంపీ అర్వింద్ ఓపెన్ ఛాలెంజ్.. అది చేయాలని డిమాండ్..?

MP Arvind: సీఎం రేవంత్‌కు ఎంపీ అర్వింద్ ఓపెన్ ఛాలెంజ్.. అది చేయాలని డిమాండ్..?
Advertisement

MP Arvind: స్వేచ్చ బ్యూరో: స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, ఇంటి మనిషి అయిన కవిత బీఆర్ఎస్, కేటీఆర్, హరీశ్ రావుపై అవినీతి, క్విడ్ ప్రో కో ఆరోపణలు చేసిందని, ఆమె చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఎంపీ అర్వింద్ డిమాండ్..

బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని, వీటిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కోరారు.

Advertisement

Also Read: పాక్‌లో విమానం అదృశ్యం.. వీడిన మిస్టరి, వాళ్లంతా ఏమయ్యారు?

ఫోన్ టాపింగ్ కుంభకోణం..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సీబీఐకి అప్పగించడంలో జరిగిన జాప్యం, ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్ ని రక్షించడం, ఫోన్ టాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోపోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారని చురకలంటించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని అర్వింద్ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని, పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అర్వింద్.. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Advertisement

Also read: BSNL మహా అద్భుతం.. ఏకంగా రూ.1.34 లక్షల ఫోన్ లాంచ్.. ప్రత్యేకత తెలిస్తే ఫ్యూజులు ఔట్!

Related News

ఒక్క స్కాన్‌తో మీ భూమి మ్యాప్ అంతా మీ ఫోన్‌లోనే.. కొత్త పాస్‌బుక్‌ల ప్రత్యేకతలు ఇవే!

ఒంటరితనంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. అనాథలకు ఆస్తి రాసిస్తూ సూసైడ్ నోట్

OLXలో బైక్ కొనేందుకు వచ్చి.. టెస్ట్ రైడ్ పేరిట బైక్‌తో పరారైన దుండగుడు

కోకాపేట తర్వాత మియాపూర్ వంతు.. భూముల వేలానికి సర్కార్ రెడీ! టార్గెట్ రూ.30 వేల కోట్లు?

బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఒకటే వాన

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య దాడి!

వాతావరణ సవాళ్లపై.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

సాగర్ జలాలపై కాక రేపుతున్న రాజకీయం.. ఇక అదొక్కటే మార్గమా..?

Big Stories

Advertisement
×