BSNL Satellite Phone: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త సంచలనానికి తెరలేపింది. మార్కెట్లోకి ఏకంగా రూ. 1,34,166 ధర కలిగిన ఒక వినూత్నమైన ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ ప్రీమియం మోడల్స్, శామ్‌సంగ్ అల్ట్రా సిరీస్ ఫోన్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ ఫోన్ గురించి ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇంతకీ ఈ ఫోన్ ఏంటి? దీని ప్రత్యేకతలేంటి? సాధారణ మొబైల్ సిగ్నల్స్ లేకపోయినా ఇది ఎలా పనిచేస్తుంది? అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ సరికొత్త గ్యాడ్జెట్.. సాధారణ స్మార్ట్‌ఫోన్ కాదు. అదొక అధునాతన శాటిలైట్ ఫోన్ (Satellite Phone). గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ ‘ఇన్మార్శాట్’ (Inmarsat) భాగస్వామ్యంతో బీఎస్ఎన్ఎల్ ఈ గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీస్ (GSPS) పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. అన్ని పన్నులతో కలిపి దీని ధర రూ.1,34,166గా బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.
BSNL launched a “Satellite Communication Phone” for Rs 1,34,166
– Supports Voice calling
– Supports SOS Emergency Alerts
– Comes with durable rugged design with long-lasting battery lifeThe real catch is that this phone is not available to everyone. Customers who want this… pic.twitter.com/YD8M5hFDQA
— TelecomTalk (@TelecomTalk) July 9, 2026
మనం వాడే సాధారణ మొబైల్ ఫోన్లు భూమిపై ఉండే మొబైల్ టవర్ల సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. టవర్లు లేని అడవులు, కొండలు లేదా సముద్రాల మధ్యలోకి వెళ్తే సాధారణ ఫోన్లలో సిగ్నల్స్ రావు. కానీ ఈ బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాల (Satellites) నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల భూమిపై ఎలాంటి మొబైల్ నెట్‌వర్క్ లేదా టవర్లు లేకపోయినా ఇది పనిచేస్తుంది. ప్రపంచంలో ఏ మూల నుంచైనా ఈ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఎస్ఎంఎస్‌లు సైతం పంపుకోవచ్చు. అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఇందులో ప్రత్యేకంగా SOS ఎమర్జెన్సీ అలర్ట్ ఫీచర్‌ను కూడా బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది.
ఈ ఫోన్ ధర వినడానికి భారీగా ఉన్నప్పటికీ దీనిని సాధారణ ప్రజలు నేరుగా మార్కెట్లోకి వెళ్లి కొనుగోలు చేయడానికి వీల్లేదు. దేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై ఇప్పటికే కఠినమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. టెలికాం శాఖ (DoT) నుంచి ముందస్తుగా అనుమతులు పొందిన సంస్థలు లేదా వ్యక్తులు మాత్రమే దీనిని కొనుగోలు చేయాలి. సరైన అనుమతులు లేకుండా శాటిలైట్ ఫోన్ దగ్గర పెట్టుకోవడం కూడా చట్టరిత్యా నేరంగా పరిగణిస్తారు.
సరిహద్దుల్లో, నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాల్లో పనిచేసే సైనికుల కోసం ఈ శాటిలైట్ ప్రత్యేకంగా రూపొందించారు. వరదలు, భూకంపాలు వచ్చినప్పుడు మొబైల్ టవర్లు కూలిపోయినా సహాయక చర్యలు అందించడానికి ఇది సాయపడనుంది. అలాగే సముద్రం మధ్యలో ప్రయాణించే ఓడలు, మత్స్యకారులకు సైతం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అదే విధంగా గనుల్లో పనిచేసేవారికి, ఎత్తైన కొండల్లో ట్రెకింగ్ చేసే సాహస యాత్రికులకు, మారుమూల పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: హోటళ్లలో తెల్లటి బెడ్‌షీట్లే ఎందుకు వాడతారు? దీని వెనుక ఉన్న ‘సీక్రెట్’ ఇదే!
ఈ శాటిలైట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ సిద్ధం చేసింది. ప్రభుత్వ, కమర్షియల్ విభాగాలకు వేర్వేరు ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల కోసం కనీస ప్లాన్ ధర రూ. 3,500 (20 నిమిషాల టాక్ టైమ్) కాగా.. ప్రైవేట్ సంస్థలకు రూ. 11,670 (60 ని. టాక్ టైమ్)గా నిర్ణయించారు. కమర్షియల్ విభాగంలో వార్షిక ప్లాన్ ధరను ఏకంగా రూ.64,185గా ఉండటం గమనార్హం. దీని కింద 360 నిమిషాల ఉచిత టాక్ టైమ్ లభించనుంది. ఫ్రీ కాల్స్ లిమిట్ దాటిన తర్వాత ప్రభుత్వ వినియోగదారులకు నిమిషానికి రూ. 18, కమర్షియల్ వినియోగదారులకు నిమిషానికి రూ. 25 చొప్పున ఛార్జ్ చేయనున్నారు.
Also Read: క్రెడిట్ కార్డ్ ఉందని తెగ స్వైప్ చేస్తున్నారా? ఈ 5 చోట్ల జాగ్రత్త.. నిండా మునిగిపోతారు!