BRS Party: బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదా.. అలాగే పార్టీలోని మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులపై పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి సారించదా.. అంటే అవుననే అంటున్నారు పలువురు మహిళా నేతలు. దీనికి కారణం ఒకేరోజు, ఒకేసారి జరిగిన ఇరువురు మహిళా నేతల రాజీనామాల పర్వమే ఉదాహరణ.
బీఆర్ఎస్ పార్టీలో ఆశాప్రియా అంటే తెలియని నేత ఉండరు. పార్టీ పరమైన అంశాలపై ఆమెకు ఉన్న పట్టు, యువ మహిళా నాయకురాలిగా, సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి విమర్శలు వినిపిస్తే చాలు.. రివర్స్ అటాక్ చేస్తారు ఆశాప్రియ. అటువంటి యాక్టివ్ బీఆర్ఎస్ నాయకురాలు, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాదు ఆమె తల్లి కూడా పార్టీకి రాజీనామా చేశారు.
కేసీఆర్ అంటే గౌరవం గల ఈ కుటుంబం 23 ఏళ్లుగా రాజకీయాలలో రాణిస్తోంది. తల్లి లలిత ప్రియను ఆదర్శంగా తీసుకున్న ఆశాప్రియ కూడా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఆశాప్రియ ఒక్క పోస్ట్ చేస్తే చాలు.. వ్యూస్ కూడా రన్నింగ్ రేస్ చేయాల్సిందే. అంతటి గుర్తింపు తెచ్చుకున్న ఆశా ప్రియకు పార్టీకి చెందిన ఓ నేత తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ఆమె ప్రకటించారు.
నా మీద కొందరు ఎడీసీ సవకండి
signing off means not just from party …but also from politics…
నేను రాజకీయాలూ చేయటానికి రాలేదు…నాకు నచ్చిన వ్యక్తీ KTR అన్న కోసం పనిచేయడానికి వచ్చాను..
కానీ నేను అలసిపోయాను ఇక నా వల్ల కాదు..
I WILL GET BACK TO MY PROFESSIONAL IT CAREER ……
— AshaPriya🇮🇳 (O+ Blood Group) (@ashapriya09) October 28, 2024
ఎన్నో రోజులుగా ఆ నేత ఇబ్బందులను భరిస్తూ ఇప్పటివరకు కొనసాగానని, ఇక తనకు పార్టీలో కొనసాగే ఓపిక కూడా లేదంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు తన రాజకీయ ఎదుగుదల చూసి కొందరు ఏడుస్తున్నారని , తను రాజకీయాలు చేయడానికి రాజకీయ రంగంలోకి రాలేదని, కేవలం కేటీఆర్ అన్న కోసం పనిచేసేందుకు వచ్చినట్లు, ఇక అలసిపోయాను.. నా వల్ల కాదంటూ పోస్ట్ చేశారు. తాను న్యూటర్న్ తీసుకొని ఐటీ ఉద్యోగానికి వెళుతున్నట్లు ఆశాప్రియ ట్వీట్ చేయడం విశేషం. అలాగే ఆమె తల్లి లలితమ్మ కూడా తనకు 23 ఏళ్ల ఉద్యమ రాజకీయ బంధానికి నేటితో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించారు.
BRS తో నాకున్న 23 ఏళ్ల ఉద్యమ,రాజకీయ బంధానికి నేటితో ముగింపు
తీసుకోండి సార్ నా రాజీనామ @KTRBRS
— Lalithamma Trs (@LalithammaTrs) October 28, 2024
వీరు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా ట్యాగ్ చేసి ఈ పోస్టులు పోస్ట్ చేశారు. ఇంతకు యువ మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకొని, ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న ఆశాప్రియను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి ఎవరో తెలియరాలేదు కానీ, వీరిద్దరి రాజీనామా మాత్రం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని సమాచారం. గతంలో కూడా ఆశాప్రియ ఇలాంటి ఆరోపణలు చేసిన సమయంలో, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకొని ఉంటే, నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది పలువురి అభిప్రాయం. మరి కేటీఆర్ మీద గౌరవం గల ఈ కుటుంబం రాజీనామాలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే కేటీఆర్ ఇచ్చే హామీతో వీరిద్దరూ న్యూ టర్న్ తీసుకుంటారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.