E-Paper
Advertisement

Telangana: దారుణం.. ఆస్తుల కోసం కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు

Telangana: దారుణం.. ఆస్తుల కోసం కన్న తల్లిని రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు
Advertisement

Telangana: ఇప్పుడున్న సొసైటీలో కన్నతల్లి కూడా బరువైపోతుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి కని పెంచి పెద్దవారిని చేస్తే.. పెళ్లీ చేసుకున్న తర్వాత ఆస్తుల కోసం కన్నతల్లిని రోడ్డుపై వదిలేస్తున్నారు. ఇప్పుడు కూడా ఒక తల్లిని నమ్మించి ఆర్డీవో ఆఫీసులో వదిలి పెట్టి వెళ్లిపోయారో ఇద్దరు దుర్మార్గపు కొడుకులు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది. మల్యాలకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు, భర్త నారాయణ దాసు మృతి చెందడంతో.. తన ఇద్దరు కొడుకులైన కృష్ణ, శ్రీనివాస్ వద్ద ఉంటోంది. పెద్ద కొడుకు జగిత్యాలలో స్థిరపడగా.. చిన్నకొడుకు శ్రీనివాస్ మల్యాలలో ఉంటున్నాడు.

తల్లికి ఆసరా అనుకున్నా… అదే కొడుకుల చేతిలో మోసం..
ఆస్తి పంపకాల్లో చిన్న కొడుకు శ్రీనివాస్‌కు పాత ఇల్లు రావడంతో.. తల్లిని బయట కిరాయి ఉంట్లో ఉంచాడు. అయితే పాత ఇంటిని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన శ్రీనివాస్ ఆమెను కొత్త ఇంట్లోకి తీసుకునేందుకు నిరాకరించాడు. దీంతో ఆమె పెద్ద కొడుకు వద్దే ఉండాల్సి వచ్చింది. ఈ విషయంపై చిన్నకొడుకును నిలదీయడానికి మాల్యాల రాగా అక్కడ తల్లీ కొడుకులిరువురికీ తీవ్ర వాగ్వాదం జరిగింది.

Advertisement

మధ్యాహ్నం వెళ్లిన తల్లిని… రాత్రి వరకూ ఎవరూ తీసుకపోనీ కొడుకులు..
సమస్య పరిష్కారానికి.. ఆర్డీవో ఆఫీసుకు వెళ్లు నేనూ వస్తా అంటూ చిన్నకొడుకు శ్రీనివాస్ తల్లిని నమ్మించి ఆటో ఎక్కించాడు. జగిత్యాల ఆర్డీవో ఆఫీసుకు పంపించాడు. అయితే ఉదయం ఆర్డీవో ఆఫీసుకు చేరిన తల్లి.. సాయంత్రం అవుతున్నా.. తన కొడుకు రాక పోవడంతో.. ఆర్డీవో కార్యాలయం ఎదుటే, తిండి నీళ్లు లేకుండా చలికి వణుకుతూ కనిపించింది.

చలిలో వణికిపోతున్న వృద్ధురాలిని గమనించిన ఆర్డీవో మధుసూదన్..
ఈ విషయం గమనించిన ఆర్డీవో మధుకర్.. ఆమె దుస్థితి తెలుసుకుని.. వెంటనే పెద్ద కొడుక్కి ఫోన్ చేశారు.. మీ తల్లిని మీరు తీస్కెళ్లాలని ఆదేశించారు. అంతే కాకుండా.. సోమవారం ఆర్డీవో కార్యాలయానికి తప్పనిసరిగా హాజరు కావాలని తేల్చి చెప్పారు. దీంతో పెద్ద కొడుకు కృష్ణ వచ్చి తన తల్లిని తీసుకెళ్లాడు. కొడుకుల నిర్లక్ష్యంతో రోడ్డు పాలైన వృద్ధురాలి పట్ల ఆర్డీవో మానవీయ స్పందన పలువురిని కదిలించింది.

Advertisement

Also Read: పరకామణి చోరీ కేసు.. నిందితుడు రవి కీలక వ్యాఖ్యలు, సీబీఐకి వెళ్లే ఛాన్స్?

మీరు చేసిన పాపం.. మేకే శాపం.. 

ఏది ఏమైనా.. కన్న తల్లిని రోడ్డు మీద వదిలివేయడం చాలా బాధాకరం.. ఇలాంటి సంఘటనలు చూసి నెక్స్ట్ జనరేషన్ వారి పిల్లలు కూడా వారిని రోడ్డుపై వదిలేస్తారు. వారు చేసిన తప్పు వారికే రివర్స్ అవుతుంది.. సో ఇప్పుడు మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటేనే తర్వాత మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు.

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×