KTR Allegations: కేటీఆర్ పై ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ బ్లాక్ మెయిలర్ అని, కేటీఆర్ బ్లాక్ మెయిలర్ రావు లాగా తెలంగాణలో చెలామణి అవుతున్నాడని అన్నారు. సాస్ అనే కంపెనీ గురించి brs గుమస్తా పేపర్లో రాశారు. సాస్లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి, సంతోష్ రావుకు వాటాలు లేవని కేటీఆర్ పిల్లలపైన ప్రమాణం చేయాలంటూ బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ ట్వీట్ చేయగానే గుమస్తా పేపర్లో వార్త వస్తుంది. gv రావు రీయల్ ఎస్టేట్ బ్రోకర్ ఆయన వెనుక ఉండి నడిపిస్తుంది కేటీఆర్ అని అన్నారు. Gv రావు కేటీఆర్ ఎదురింటిలో ఉంటారు. Gv రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి, సంతోష్ రావుకు పార్ట్ నరా కదా? సాస్ ను కన్స్ట్రక్షన్ కంపెనీగా ప్రమోషన్ చేసిందే కేటీఆర్ అని అన్నారు. Gv రావును మహబూబ్ నగర్ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో గోవా పిలిచి మాట్లాడింది వాస్తవం కాదా? సీబీఐ విచారణ చేసి ఇబ్బంది పెట్టొద్దని కేటీఆర్ అమిత్ షా ను కలిసింది వాస్తవామా కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు SIR పై మాట్లాడని బీజేపీ ఇస్తేదార్ పార్టీ brs పార్టీ అని అంటుందని అన్నారు.
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డమ్మీ అభ్యర్డులను పెట్టి లోపాయికార ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపాలని బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ బెదిరిస్తే కంపెనీ యజమానులు భయపడొద్దు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కేటీఆర్ మాట్లాడేది అవాస్తవం కాబట్టే ఎవరు బయటకు రావట్లేదని, కేటీఆర్ పర్సనల్ విషయాలు బయట పెట్టొద్దని వాళ్ళ అడ్వొకేట్ లీగల్ నోటీసులు పంపారని అన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తి గత విషయాలు బయటపెట్టే కేటీఆర్ బండారం తెలంగాణ సమాజానికి తెలియాలని బల్మూరి వెంకట్ అన్నారు.
Also read: హైదరాబాద్లో భారీ గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు!