E-Paper
Advertisement

పేట్‌బషీరాబాద్‌లో రేషన్ గోధుమల దందా.. పంజాబ్ నుంచి వచ్చి టాప్ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్!

పేట్‌బషీరాబాద్‌లో రేషన్ గోధుమల దందా.. పంజాబ్ నుంచి వచ్చి టాప్ బ్రాండ్ల పేరుతో ప్యాకింగ్!
Advertisement

Ration Wheat: పంజాబ్‌ నుంచి రేషన్‌ గోధుమలు.. సుభాష్‌నగర్‌లోని గోదాములకు తరలింపు.. అక్కడే పిండి పట్టించి ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఉన్న సంచుల్లో ప్యాకింగ్‌.. ఇదీ పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌లో జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్న వ్యవహారం. ప్రభుత్వ రేషన్‌ గోధుమలను వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పంజాబ్‌ నుంచి భారీగా గోధుమలను గోదాములకు తరలించి నిల్వ చేస్తున్నట్లు సమాచారం. అనంతరం వాటిని యంత్రాల ద్వారా పిండి పట్టించి, వివిధ బ్రాండ్ల పేర్లతో ఉన్న సంచుల్లో నింపి మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ గోధుమలు నిజంగా రేషన్‌ కోటాకు సంబంధించినవేనా? లేక ఇతర వాణిజ్య సరుకా? వాటి కొనుగోలు, రవాణా పత్రాలు ఏమిటి? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.

బ్రాండెడ్‌ పేరుతో వ్యాపారం!

గోధుమలు ఎక్కడ పండాయి? ఎక్కడ నుంచి వచ్చాయి? ఏ నాణ్యతతో పిండి తయారైంది? అన్న వివరాలు వినియోగదారులకు తెలియకుండానే బ్రాండెడ్‌ సంచుల్లో విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్యాకింగ్‌, నాణ్యత, ఆహార భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా?

Advertisement

గోదాముల్లో నిల్వలు, పంజాబ్‌ నుంచి వచ్చిన సరుకు రవాణా పత్రాలు, పిండి తయారీ యంత్రాలు, బ్రాండెడ్‌ సంచుల్లో ప్యాకింగ్‌ వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ, ఆహార భద్రతా శాఖ అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రేషన్ గోదాములు దందా చాలా కాలంగా సాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు . ఇప్పటికైనా రేషన్‌ గోధుమల మళ్లింపు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: గవర్నర్ కోటాలో ఎవరిని సెలెక్ట్ చేద్దాం.. లిస్ట్‌లో ఆ కీలక నేతల పేర్లు..?

Tags

Related News

మీ ఇంటికి కొత్త విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్?

మూడో తరగతి విద్యార్థిపై లైంగిక దాడి!

ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో SDRF బోట్ల ప్రమాదం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ!

ప్రభుత్వ బడి పిల్లలకు.. సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఐ సపోర్ట్ వారికే.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని..?

తెలంగాణలో ఒకేషనల్ ట్రైనర్ల నిరసన కాక.. అడ్డుకున్న పోలీసులు!

పశువుల కొట్టం కంటే ఘోరం.. అమెరికాతో పోటీ అంటే ఇదేనా? మెడికోల సమ్మెకు హరీశ్ రావు సపోర్ట్!

Big Stories

Advertisement
×