Drug Gang: అసోంకు చెందిన డ్రగ్స్ ముఠాను పట్టుకున్న హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 60 రోజుల పాటు కొనసాగిన వేటకు తెరదించిన ఈగల్ ఫోర్స్ STF బృందం భారీ గ్యాంగ్ దందాను రట్టు చేశారు. వీరిలో ప్రధాన సూత్రధారి భాస్కర్ హజారికాతో సహా ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24.7 కిలోల గంజాయి, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ హజారికా కోసం రెండు నెలలుగా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు.
అయితే గతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన భాస్కర్.. డ్రగ్స్ కింగ్‌పిన్‌గా అవతారం ఎత్తాడు. 2024లో మాదాపూర్‌లో రెండు, గచ్చిబౌలిలో ఒక డ్రగ్స్ కేసు అతనిపై నమోదు అయింది. దీంతో మూడు కేసుల్లోనూ బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఒడిశా నుంచి భారీగా గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బికాస్ బారిక్ ద్వారా గంజాయి సరఫరా.. మరో ఇద్దరు ఒడిశా సప్లయర్లతో కలిసి.. బాబు బోరా, నిర్మల్ హజారికా ద్వారా గంజాయి కొరియర్ వ్యవస్థ నడిపిస్తున్నారు.
కిలో గంజాయిని 150 చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు చేస్తున్నారు. దీంతో ఒక్కో ప్యాకెట్ రూ.300 చొప్పున అమ్మకం చేస్తున్నారు. దీంతో నెలకు 40 నుంచి 50 కిలోల గంజాయి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 10 నెలల్లో సుమారు 400 కిలోల గంజాయి వ్యాపారం చేసాడని, ఒడిశాకు చెందిన ఆశిష్ కుమార్‌కు 88 విడతల్లో రూ.48 లక్షల చెల్లింపులు అయినట్టు పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. కిలో గంజాయిని రూ.12 వేల నుంచి రూ.15 వేలకు కొనుగోలు చేసి కిలోను సుమారు రూ.50 వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
10 నెలల్లో సుమారు రూ.1.8 కోట్ల విలువైన గంజాయి విక్రయాలు చేసారు. బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ కమ్యూనికేషన్ల ఆధారంగా డ్రగ్స్ నెట్‌వర్క్ ను పోలీసులు గుర్తించారు. కొరియర్లు, ప్యాకింగ్, మార్కెటింగ్, డెలివరీ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని, చౌటుప్పల్ కేసులో పరారీలో ఉన్న భాస్కర్‌ను పట్టుకోవడంతో ఈ అసలు విషయం బైటపడింది. దీంతో ఆగస్టు 27న చౌటుప్పల్‌లో 20.36 కిలోల గంజాయితో ఇద్దరు పట్టుబడగా.. వారి విచారణలో భాస్కర్ హజారికా డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది. దీంతో ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో ఆపరేషన్ సక్సెస్ అయింది.
Also read: ఏటీఎంలకు కొత్త రూల్స్.. అమలు చేస్తున్న ఒక్కో బ్యాంకు, లబోదిబోమంటున్న కస్టమర్లు