E-Paper
Advertisement

వేల ఎకరాలు అమ్ముకున్న మీరా.. ఇప్పుడు మాట్లాడేది? బీఆర్ఎస్‌పై అద్దంకి ఫైర్

వేల ఎకరాలు అమ్ముకున్న మీరా.. ఇప్పుడు మాట్లాడేది? బీఆర్ఎస్‌పై అద్దంకి ఫైర్
Advertisement

Addanki Dayakar: హైదరాబాద్‌లోని 33 ఎకరాల ట్రక్ పార్క్ భూమి చుట్టూ బీఆర్ఎస్ చేస్తున్న రాద్ధాంతం పూర్తిగా రాజకీయ లబ్ధి కోసమేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తేల్చి చెప్పారు. వరంగల్‌లోని వైఎస్సార్ కాలనీ భూముల వేలంపై కూడా ప్రతిపక్షాలు అనవసరంగా గొడవ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. భూములను లీజుకు ఇవ్వడం, అమ్మకానికి పెట్టడం ప్రభుత్వంలో సాధారణ ప్రక్రియేనని స్పష్టం చేశారు.

ట్రక్ పార్క్ భూములపై బీఆర్ఎస్ కన్ను

Advertisement

ట్రక్ పార్క్ కోసం కేటాయించిన ఈ భూమి ఏళ్లుగా నిరుపయోగంగా ఖాళీగా పడి ఉంది. ఆ విలువైన స్థలాన్ని ఎలా కొట్టేయాలా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచో కన్నేసి ఉంచారని అద్దంకి ఆరోపించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల ఎకరాల ప్రభుత్వ భూములను వేలం వేసి అమ్మారని గుర్తు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో తమ వాళ్లకు, బినామీలకు, సినీ తారలకు తక్కువ ధరకే భూములు కట్టబెట్టారని విమర్శించారు.

అప్పుల ఊబిలో నెట్టి.. ఆదాయానికి అడ్డుపుల్ల

Advertisement

గత ప్రభుత్వంలో రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని అద్దంకి అన్నారు. ఆ అప్పులపై ఏటా రూ. 50 వేల కోట్లకు పైగా వడ్డీలు, ఈఎంఐలు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ద్వారా ఆదాయం సమకూర్చుకుంటే కోర్టుల్లో కేసులు, అప్పీళ్లతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల భూముల చరిత్ర ఎవరిది?

అసైన్డ్, భూదాన్, ఎవాక్యూ ప్రాపర్టీస్‌తో పాటు కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల పేరుతో పేదల నుంచి దాదాపు 20 వేల ఎకరాలు లాక్కున్న చరిత్ర బీఆర్ఎస్‌దని అన్నారు. అప్పుడు ప్రజల పక్షాన నిలబడితే తమను జైళ్లలో వేశారని గుర్తు చేశారు. 22ఏ భూముల చర్చకు అసెంబ్లీకి రాని ప్రతిపక్షాలు, అమీర్‌పేట ధర్నాలు, వరంగల్ గొడవలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ఈ నిజాలను ప్రజలు గమనించాలని అద్దంకి దయాకర్ కోరారు.

Also Read: హైదరాబాద్‌ను భయపెడుతున్న నీటి గండం.. ఏడాదిలో 4 రెట్లు పెరిగిన ట్యాంకర్ బుకింగ్స్!

Tags

Related News

హైదరాబాద్ దాహార్తికి చెక్.. మల్లన్నసాగర్ నీళ్లు వచ్చేశాయ్!

OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్.. 10వ తరగతి వరకు ఉచిత విద్య, అప్లై చేసుకోండిలా!

పదో తరగతి మెమోలో తప్పులా? విద్యార్థులకు ఇకపై నో టెన్షన్, మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఎగిరిగంతేస్తున్న విద్యార్థులు, అసలు విషయం తెలుసా?

Big Stories

Advertisement
×