E-Paper
Advertisement

బండి భగీరథ్‌కు బెయిల్.. కానీ హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన షరతులు ఇవే!

బండి భగీరథ్‌కు బెయిల్.. కానీ హైకోర్టు పెట్టిన ఆ కఠినమైన షరతులు ఇవే!
Advertisement

Bandi Bhagirath: బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఆయన త్వరలోనే జైలు నుంచి విడుదల కానున్నారు.

కేసుకు సంబంధించిన నేపథ్యం

Advertisement

పేటబషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక పోక్సో (POCSO) కేసులో బండి భగీరథ్‌ను మే 16వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో, అప్పటి నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా బెయిల్ లభించింది.

Also Read: రైల్వే ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, వెండి అపహరణ!

Advertisement

కోర్టు విధించిన కీలక షరతులు

భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కఠినమైన నిబంధనలను విధించింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు (జామీను) సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయకూడదని గట్టిగా ఆదేశించింది. ఈ షరతులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుండి బయటకు రానున్నారు.

Related News

తెలంగాణ నుంచి మూడు హైస్పీడ్ ట్రైన్ రూట్స్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

గాంధీభవన్‌లో టీపీసీసీ చీఫ్ సంచలనం.. కేసీఆర్‌కి బీజేపీకి అంటే భయం అందుకే..?

అంగన్‌వాడీ సిబ్బందికి.. తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్?

రాహుల్‌కి అనుకూలంగా ఉంటేనే ప్రజాస్వామ్యమా? కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఆర్టీసీ సంఘం ఎన్నికల్లో 98శాతం పోలింగ్..గెలుపు దిశగా ఎంప్లాయీస్‌ యూనియన్‌ ?

జోగులాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సంక్షోభం.. ఎండిపోతున్న పంటలు!

సూపర్ మార్కేట్‌లో షాపింగ్ చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్..?

సైదాపూర్‌లో దారుణం.. మూగ పిల్లలున్న ఒంటరి మహిళపై కర్రలతో దాడి!

Big Stories

Advertisement
×