E-Paper
Advertisement

CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!

CM Revanth Reddy: గాంధీ భవన్ లీడర్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్.. 30 నెలల పాలనపై సీఎం షాకింగ్ రిపోర్ట్!
Advertisement

CM Revanth Reddy: స్వేచ్చ బ్యూరో: “ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. మీరేం చేస్తున్నారు?” అంటూ తాజాగా ప్రజా భవన్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌చార్జులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా గాంధీ భవన్ వర్గాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు, కీలక నేతలు ఘోరంగా విఫలమవుతున్నారనేది సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

సీఎం తీవ్ర అసంతృప్తి..

​ముఖ్యంగా పార్టీ ఆర్గనైజేషన్‌లో ఫ్రంట్ లైన్ లీడర్లతో పాటు, సీనియర్లలో సైతం కొరవడిన బాధ్యతాయుత ప్రవర్తన, నిర్లక్ష్యంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి గత ప్రభుత్వాన్ని గద్దించడంలో కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు, ముఖ్య నాయకులు ప్రస్తుతం మౌనంగా ఎందుకు ఉన్నారంటూ సీఎం నేరుగానే ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 30 నెలల్లో ఏ రాష్ట్రం చేయనటువంటి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందని సీఎం నొక్కి చెప్పారు. కానీ ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాకపోవడం బాధాకరమంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు ప్రధానంగా పార్టీ నేతలు సమన్వయంగా వర్క్ చేయలేకపోయారని సీఎం నేతలకు క్లాస్ పీకారు.

​ఉద్యోగాలు ఇచ్చినా.. ఊసేది?: సీఎం సూటి ప్రశ్న!

Advertisement

​కేవలం 30 నెలల కాలంలోనే 67 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల్లో నమ్మకం నింపినా.. ఆ విషయాన్ని ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వడంలో పార్టీ ఎందుకు వెనుకబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అతి తక్కువ కాలంలో 67 వేల ఉద్యోగాల భర్తీ చేసినా మైలేజ్ రాకపోవడంపై సీఎం గుర్రుగా ఉన్నారు. ఇక గత ప్రభుత్వంలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల జీతాలను, ప్రతి నెల 1వ తేదీనే చెల్లించేలా సంస్కరణలు తీసుకువచ్చినా మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు నేరుగా చేరవేయడం లో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందని సీఎం గుర్తు చేశారు.​”ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా.. ప్రజా కోణంలో పరిపాలనపై అసంతృప్తి ఉందనే భ్రమను ప్రతిపక్షాలు కల్పిస్తుంటే, మన లీడర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?” అని సీఎం ఫైర్ అయ్యారు.

Also read: అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు

​ప్రచారంలో ఫెయిల్.. పార్టీ ప్రక్షాళనకు హింట్!

Advertisement

​ప్రభుత్వ ఘనతలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా, గ్రౌండ్ లెవెల్ క్యాంపెయినింగ్ రెండింటిలోనూ నేతలు విఫలమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. అధికారంలో ఉన్నామనే ధీమాతో కొందరు, సమన్వయ లోపంతో మరికొందరు వ్యవహరిస్తుండటం వల్లే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు పైచేయి సాధిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ​ఈ నేపథ్యంలోనే ప్రజా భవన్ మీటింగ్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన హింట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో “పార్టీ ప్రక్షాళన” తప్పదనే సంకేతాలు పంపారు. కేవలం పదవులను అనుభవించడం కాదు. క్షేత్రస్థాయిలో పనితీరు ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందని, నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనకాడబోమని సీఎం హెచ్చరించినట్లు సమాచారం.

ఒక్కసారిగా గుబులు..

అయితే సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ పీకడంతో గాంధీ భవన్ లీడర్లలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన నేతలు, ఇప్పుడు తమ ఉనికిని చాటుకునేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ హెచ్చరికల తర్వాత అయినా కాంగ్రెస్ శ్రేణుల్లో కదలిక వస్తుందా? ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడతారా? అనేది వేచి చూడాలి.

Also read: Telangana Education: పీజీఐ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన తెలంగాణ.. ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం!

Related News

Extramarital Affairs: ఆ ఒక్క కారణంతోనే.. భర్తలను అతి దారుణంగా చంపేస్తున్న భార్యలు!

కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్.. ఎంపీ అరవింద్ షాకింగ్ కామెంట్స్!

తెలంగాణ ఆర్టీసీలో..1,500 కండక్టర్ జాబ్స్, టెన్త్ పాసైతే చాలు!

మెదక్‌లో సినిమా స్టైల్ కిడ్నాప్.. నాలుగు కార్లలో వచ్చి నవవధువును ఎత్తుకెళ్లిన బంధువులు!

Telangana Education: పీజీఐ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయిన తెలంగాణ.. ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం!

మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి.. విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

ప్రియురాలికి పెళ్లి..ఊరంతా పోస్టర్లు వేసిన ప్రియుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన, సోషల్ మీడియాలో వైరల్

Big Stories

Advertisement
×