Kamran Akmal: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి 20 సిరీస్ నేపథ్యంలో ఇప్పటికి రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన టీమ్ ఇండియా, తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళింది. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య బ్రిస్టల్ వేదికగా నాలుగవ టి20 జరగనుంది. ఇలాంటి క్రమంలో టీమిండియా ప్రదర్శన పై సోషల్ మీడియా వేదికగా దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకత మొదలైంది. అయితే టీమిండియా ప్రదర్శన పై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ తన స్టైల్ లో విమర్శలు చేశారు. గౌతమ్ గంభీర్ కారణంగానే టీమ్ ఇండియా పతనం మొదలైందని హెచ్చరించారు. గౌతమ్ గంభీర్ ను తప్పించి.. మరో వ్యక్తికి హెడ్ కోచ్ పదవి ఇవ్వాల్సిందేనని కోరారు. లేకపోతే టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని వార్నింగ్ ఇచ్చారు. సూర్య కుమార్ యాదవ్, బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లను టి20 జట్టులోకి తీసుకోవాలని కోరారు. అప్పుడే టీమిండియా బాగుపడుతుందని సూచనలు చేశారు కమ్రాన్ అక్మల్ (Kamran Akmal).
ఇంగ్లాండ్ సిరీస్ లో టీమిండియా సతమతమవుతున్న నేపథ్యంలో కమ్రాన్ అక్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా, ఇదే ఆట తీరును ప్రదర్శిస్తే.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్ అవుతుందన్నారు. టీమిండియాలో కీలక ప్లేయర్లను పక్కకు పెట్టి గౌతమ్ గంభీర్ గేమ్స్ ఆడుతున్నాడని మండిపడ్డారు. మూడు నెలల కిందట టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచిన టీమ్ ఇండియా… ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడం దారుణమన్నారు. అనవసరంగా హార్దిక్ పాండ్యా, బుమ్రాలను ( Jasprit Bumrah) తప్పించాడని మండిపడ్డారు. ఇక వరల్డ్ కప్ తీసుకువచ్చిన సూర్య కుమార్ యాదవ్ కు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా తీసి బయట పడేసారని ఆగ్రహించారు.
అతనికి ఐర్లాండ్, ఇంగ్లాండ్ అంటే సిరీస్ లలో అవకాశం ఇచ్చి ఉంటే.. బాగుండేదని సూచనలు చేశారు. కానీ ఆ పని చేయకుండా… గౌతమ్ గంభీర్ మాటలు విని బీసీసీఐ బోల్తా పడిందని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ఇప్పటికిప్పుడు గౌతమ్ గంభీర్ ను ( Gautam Gambhir) తప్పించకపోతే, టీమ్ ఇండియా ( Team India) కొంప మునగడం గ్యారంటీ అని హెచ్చరించారు. వెంటనే గౌతమ్ గంభీర్ స్థానంలో మహేంద్రసింగ్ ధోని లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. గౌతమ్ గంభీర్ ను మార్చకపోతే టీమిండియా మరో ఉగాండా అవుతుందని వార్నింగ్ ఇచ్చారు.