E-Paper
Advertisement

Bandi Sanjay: కిషన్‌రెడ్డికి హ్యాండిచ్చిన బండి సంజయ్.. ఎందుకలా?

Bandi Sanjay: కిషన్‌రెడ్డికి హ్యాండిచ్చిన బండి సంజయ్.. ఎందుకలా?
Advertisement
bandi sanjay kishan reddy

Bandi Sanjay: కిషన్‌రెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టారు. తాను అలగలేదని వివరణ ఇచ్చుకున్నారు. పార్టీయే తనకు సర్వస్వం అని చెప్పుకొచ్చారు. కాసేపట్లో తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్తానని.. మోదీ వరంగల్ సభ ఏర్పాట్లు చూస్తానని చెప్పారు. తనతో పాటు బండి సంజయ్ కూడా విమానంలో హైదరాబాద్ వస్తున్నారని అన్నారు.

కాసేపటికి.. కిషన్‌రెడ్డి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. కార్యకర్తల జయజయ ధ్వానాలతో పార్టీ కొత్త అధ్యక్షుడికి గ్రాండ్ వెల్‌కమ్ దక్కింది. ఈటల రాజేందర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. కిషన్‌రెడ్డితో పాటు ఈటలను భుజాల మీదకు ఎత్తుకొని.. సాదర స్వాగతం పలికారు కార్యకర్తలు.

Advertisement

కట్ చేస్తే.. కిషన్‌రెడ్డి వచ్చిన విమానంలో ఆయనతో పాటు బండి సంజయ్ రాలేదు. తనతో పాటు ఈటల కూడా వస్తారని చెప్పినా.. ఆయన రాకుండా ముఖం చాటేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిలిచినా వెంట వెళ్లలేదు. తనకు పని ఉందంటూ ఢిల్లీలోనే ఆగిపోయారు. రైల్వేమంత్రిని కలిసి పలు విన్నపాలు చేశారు. బండి డుమ్మా కొట్టడంతో.. కిషన్‌రెడ్డి ఒక్కరే హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ పరిణామం ముందే ఊహించి.. బండి సంజయ్ ఆయనతో కలిసి రాలేదని అంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీ అధ్యక్షుడిగా ఓ వెలుగు వెలిగిన బండి.. ఇప్పుడు తన కళ్లముందే మరొకరికి పార్టీ ప్రెసిడెంట్‌గా స్వాగతం లభిస్తుంటే.. చూసి తట్టుకునే శక్తి సంజయ్‌కు లేదంటున్నారు. అందులోనూ, ఈటల రాజేందర్ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసి.. ఆ అవమాన భారాన్ని మోయలేకే.. బండి ఢిల్లీలోనే ఆగిపోయారని చెబుతున్నారు. తీరిగ్గా మర్నాడు రావొచ్చులే అనుకున్నారట బండి సంజయ్.

Related News

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

Big Stories

Advertisement
×