E-Paper
Advertisement

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?
Advertisement

Pregnancy self medication risks: ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీ జీవితంలోనూ ఒక అద్భుతమైన ఘట్టం. ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో చిన్నపాటి తలనొప్పి, వాంతులు, ఒళ్లు నొప్పులు లేదా జ్వరం రావడం సర్వసాధారణం. అయితే.. ఇలాంటప్పుడు చాలామంది షాప్‌కి వెళ్లి సొంతంగా మెడిసిన్స్ కొనుక్కొని వాడేస్తుంటారు. కానీ, ప్రెగ్నెన్సీ సమయంలో వేసుకునే ఒక్క చిన్న మాత్ర కూడా కడుపులో ఎదుగుతున్న బిడ్డ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ప్లాసెంటా దాటి బిడ్డకు చేరే రసాయనాలు:

తల్లి తినే ఆహారమైనా, వేసుకునే మందులైనా బొడ్డు పేగు ద్వారానే కడుపులోని బిడ్డకు చేరుతాయి. ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో పిండం అవయవాలు రూపుదిద్దుకుంటాయి. ఈ సమయంలో సరైన అవగాహన లేకుండా ఏవైనా పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటిక్స్ లేదా స్టెరాయిడ్స్ వాడితే అవి బిడ్డ గుండె, మెదడు, అవయవాల ఎదుగుదలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి.

సొంత వైద్యం వల్ల కలిగే తీవ్ర నష్టాలు:

Advertisement

అంగవైకల్యం : డాక్టర్ల అనుమతి లేకుండా వాడే కొన్ని రకాల తీవ్రమైన మందుల వల్ల బిడ్డ పుట్టుకతోనే.. అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

గర్భస్రావం ప్రమాదం: పవర్ ఫుల్ పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాల యాంటీబయోటిక్స్ గర్భాశయ సంకోచాలను పెంచి గర్భస్రావానికి దారి తీస్తాయి.

Advertisement

నెలలు నిండకుండానే ప్రసవం: కొన్ని రకాల మెడిసిన్స్ రక్తప్రసరణను ప్రభావితం చేసి ప్రసవ సమయం కంటే.. ముందే డెలివరీ అయ్యేలా చేస్తాయి.

తక్కువ బరువుతో పుట్టడం: కడుపులోని బిడ్డ సరైన పోషకాలు అందుకోలేక, పుట్టేటప్పుడు తక్కువ బరువుతో జన్మించవచ్చు.

మందుల వాడకంలో డాక్టర్ కీలక సలహాలు:

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి:
చిన్న తలనొప్పి, అసిడిటీ లేదా జలుబు చేసినా సరే.. మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించిన తర్వాతే.. వారు సూచించిన ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం లేదా ఇతర మందులను మాత్రమే వాడాలి.

పాత మెడిసిన్స్ వాడకండి:
గతంలో వేరే ప్రెగ్నెన్సీకి వాడిన మందులను లేదా వేరొకరు ఇచ్చిన సలహాల ప్రకారం టాబ్లెట్లు వేసుకోవడం చాలా ప్రమాదకరం.

సప్లిమెంట్స్ జాగ్రత్త:
కేవలం అలోపతి మందులే కాదు, ఆయుర్వేద, హోమియోపతి లేదా విటమిన్ సప్లిమెంట్లు వాడుతున్నా కూడా ముందుగా మీ డాక్టర్‌కు తెలియజేయడం ముఖ్యం.

ప్రెగ్రెన్సీ సమయంలో చిన్న పొరపాటు కూడా మీ పిల్లలపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే.. ఆరోగ్య సమస్య ఏదైనా సరే, సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు పాటిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటమే అందరికీ ఆనందం!

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×