E-Paper
Advertisement

బాసర సరస్వతిదేవి ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు దోచేశారు, తలుపు బద్దలు కొట్టి, ఆ తర్వాత

బాసర సరస్వతిదేవి ఆలయంలో చోరీ.. అమ్మవారి ఆభరణాలు దోచేశారు, తలుపు బద్దలు కొట్టి, ఆ తర్వాత
Advertisement

Basara Saraswati Temple: తెలంగాణలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయం తలుపులు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటం, హుండీని ఎత్తుకుపోయారు. రాత్రి విధుల్లో ఆరుగురు ఉద్యోగులున్నా, చోరీ జరగడంతో అనుమానాలు మొదలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నారు.

బాసర సరస్వతిదేవి ఆలయంలో అర్ధరాత్రి చోరీ

Advertisement

బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయంలోని మొదటి అంతస్తులో మహంకాళి అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటం, హుండీని ఎత్తుకెళ్లారు.

మంగళవారం ఉదయం మహంకాళి అమ్మవారికి అభిషేకం, పూజలు నిర్వహించేందుకు వెళ్లారు అర్చకులు. అయితే ఆలయ తాళాలు పగులగొట్టి ఉండడం కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా అమ్మవారి కిరీటం కనిపించలేదు. భక్తులు కానుకలు సమర్పించిన హుండీ లేదు. చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించిన అర్చకులు వ్యాస గుడి సమీపంలో హుండీ కనిపించింది.

Advertisement

అమ్మవారి ఆభరణాలు, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

ఈ ఘటనతో షాకయ్యారు ఆలయ అర్చకులు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆలయ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆలయ వెనుక వైపు నుంచి లోపలికి దొంగలు వచ్చినట్లు నిర్ధారించారు పోలీసులు.

దొంగల వేలిముద్రలు, ఆధారాల కోసం క్లూస్ టీమ్‌ దిగేసింది. డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టారు. ఇదిలాఉండగా ఆలయ పరిసరాల్లో సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. దొంగలు ఏ మార్గం నుంచి వచ్చారు? ఎంతమంది అనేదానిపై ఫుటేజీ పరిశీలిస్తున్నారు.

ALSO READ: జోరుగా నైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, మరో మూడు రోజులు

ఆలయ విధుల్లో రాత్రివేళ ఆరుగురు హోంగార్డులు ఉన్నారు. అయినప్పటికీ దొంగలు తాళాలు పగులగొట్టి వెండి కిరీటం, హుండీని ఎలా ఎత్తుకుపోయారు? అనేదానిపై అనుమానాలు మొదలయ్యాయి. మరి చోరీ జరిగిన సమయంలో హోంగార్డులు డ్యూటీలో ఉన్నారా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. దొంగలను త్వరలో పట్టుకుంటామని, ఆలయానికి భద్రతను కఠినతరం చేస్తామని చెబుతున్నారు పోలీసులు.

 

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×