E-Paper
Advertisement

రూ.51 లక్షలకు లడ్డు కొని.. రూ.4 కోట్లతో జంప్.. మై హోమ్ భుజాలో క్లాసిక్ మోసం!

రూ.51 లక్షలకు లడ్డు కొని.. రూ.4 కోట్లతో జంప్.. మై హోమ్ భుజాలో క్లాసిక్ మోసం!
Advertisement

Hyderabad Fraud: హైదరాబాద్ లోని మై హోం భుజా అపార్ట్ మెంట్స్ పేరు వినగానే.. గణేష్ లడ్డూ వేలం గుర్తుకొస్తుంది. ఇక్కడ ఉండేవారు లక్షల రూపాయలకు లడ్డూను వేలంలో కొని ఆ డబ్బును సామాజిక సేవలకు వినియోగిస్తుంటారు. సరిగ్గా దీనినే అవకాశంగా చేసుకున్నారు కొండపల్లి గణేష్, కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు.

మై హోం భుజాలో ఉంటున్నావారితో పరిచయాలు పెంచుకోవడానికి వినాయక చవితిని అవకాశంగా మార్చుకున్నారు. వినాయకుడి పూజల తర్వాత వేలం వేసిన లడ్డూను 51 లక్షలకు సొంతం చేసుకున్నారు. అపార్ట్ మెంట్ కమ్యూనిటీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లడ్డూ కోసం యాబై లక్షలు పెట్టిన వీళ్లను అందరూ సంపన్నులని భావించారు.

Advertisement

ఆ తర్వాత ఇద్దరు తమ అసలు ప్లాన్ ను అమలు చేశారు. తాము చేస్తున్న రియల్ ఎస్టేట్.. ఇతరత్రా వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే నెలకు ఆరు శాతం లాభాలు ఇస్తామంటూ ఆఫర్ పెట్టారు. వీరి మాటలు నమ్మిన మై హోం భుజాలో ఉంటున్న దంపతులు రూ. 31 లక్షలు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తరువాత ముఖం చాటేసిన గణేష్ కిరణ్ లు.. ఎప్పుడు డబ్బు గురించి అడిగినా దాటవేస్తూ వచ్చారు.

Also Read: పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!

Advertisement

అదే సమయంలో మరికొందరి నుంచి కూడా పెద్ద మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి అపార్ట్ మెంట్ ఖాళీ చేసి ఉడాయించారు. బాధితులు చెబుతున్న దానిని బట్టి ఇద్దరు కలిసి దాదాపు రూ.4 కోట్లు వసూల్ చేసినట్టుగా తెలుస్తోంది. పలువురు రిటైర్డ్‌ ఉద్యోగుల జీవితకాల పొదుపులకూ ఈ ఇద్దరు ఎసరు పెట్టారని తెలిసింది. మోసం చేసిన గణేష్, కిరణ్ ఆచూకీ తెలియకపోవడం.. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: పాతబావిలో ఉన్న నిధి కోసం ఊరంతా పోట్లాట… చివరికి బయటపడింది ఏంటో తెలిస్తే బుర్రపాడు

Tags

Related News

సుప్రీంలో చుక్కెదురు.. దానం నాగేందర్ ఆసక్తికర రియాక్షన్.. ‘ఇది ముందే తెలుసంటూ..!’

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×