E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode August 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీని కొట్టిన ఐశ్వర్య 

Brahmamudi Serial Today Episode August 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీని కొట్టిన ఐశ్వర్య 
Advertisement

Brahmamudi serial today Episode: లక్కీ సడెన్‌గా ఐశ్వర్య రూంలోకి వెళ్తాడు. లక్కీని చూసిన ఐశ్వర్య కోపంగా తిడుతుంది. ఒక ఆడపిల్ల రూంలోకి వచ్చే ముందు డోర్‌ కొట్టి రావాలని తెలియదా అంటూ కోప్పడుతుంది. లక్కీ మాత్రం ఇంకా మన మధ్య పర్మిషన్స్‌ ఎందుకు అంటూ మెలికలు తిరిగిపోతుంటాడు. ఐశ్వర్య ఏయ్‌ ఏం చేస్తున్నావు అసలు ఎందుకు మెలికలు తిరుగుతున్నావు అంటూ తిడుతుంటే.. లక్కీ అబ్బో వెనకుండి అంతా నడిపిస్తూ.. బయటకు మాత్రం ఏమీ తెలియనట్టు భలే నటిస్తున్నావు ఐషు అనగానే.. ఐశ్వర్య కోపంగా నేను నటించడం ఏంటి..? అని అడుగుతుంది. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతుంది.

లక్కీ పెళ్లి గురించి అని చెప్పగానే.. ఐశ్వర్య షాకింగ్‌ గా పెళ్లి గురించా..? అని ప్రశ్నిస్తే.. అవును నువ్వు పెళ్లి విషయంలో ఎంత పెద్ద ప్లాన్ చేశావో నేను ఆ మాత్రం తెలుసుకోలేను అనుకున్నావా..? అని చెప్పగానే.. ఐశ్వర్య మనసులో నేను శశిని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం వీడికి తెలిసిపోయిందా ఏంటి..? అని భయపడుతుంది. లక్కీ మాత్రం ఐషు నీ మనసులో అంత ఇష్టం ప్రేమ ఉందని నేను అసలు అనుకోలేదు.. అని చెప్పగానే.. ఐషు మాత్రం ప్రేమా తొక్కా నేను వాణ్ని పెళ్లి చేసుకోవాలనుకుంది డబ్బు కోసం అని మనసులో అనుకుంటుంది. ఇంతలో లక్కీ సంతోషంగా నేను చిన్న పార్టీ అడిగితే నువ్వు ఇంత పెద్ద ఆఫర్‌ ఇస్తావని అసలు అనుకోలేదు.. ఇక వెళ్లి ఫేసియల్‌ చేసుకుంటాను అంటూ వెళ్లిపోతాడు లక్కీ. దీంతో అసలు వీడు ఎందుకు వచ్చాడు.. ఏం మాట్లాడాడు.. అసలు అర్థం కావడం లేదు అనుకుంటుంది.

Advertisement

స్టెప్స్‌ మీద కూర్చుని ఏడుస్తున్న నందును చూసి ఇందు ఓదారుస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. నందు ఏం లేదని చెప్తుంది. ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా..? ఆ రేఖ ఆంటీ కానీ.. భ్రమరాంబ పిన్ని కానీ తిట్టారా..? అని అడిగితే.. ఏం లేదక్కా అంటూ ఏడుస్తూనే ఉంటుంది. అందుకు ఇందు ఏంటే నేను పరాయిదాన్ని అనుకున్నావా..? ఎందుకు నిజం చెప్పడం లేదని నిలదీస్తుంది. అప్పుడు నిజం చెప్తుంది నందు. వెంకీ తనను అవైడ్‌ చేస్తున్నాడని.. నా ఫోన్‌ లిఫ్ట్ చేయడం లేదు. వాడెందుకు అలా బిహేవ్‌ చేస్తున్నాడో అర్థం కావడం లేదక్కా.. అంటూ ఏడుస్తుంటే.. ఇందు నవ్వుతూ అసలు ఇలా చేస్తుంది నువ్వేనా నందు. ఎవరనా ఏమైనా అంటే రౌడీలా రఫ్‌గా సమాధానం చెప్తావు కదా..?

సరే వెంకీ విషయంలో హార్స్‌గా లేకపోయినా ధైర్యంగా ఉండాలి కదా అని ఇందు చెబితే నాకు ధైర్యం సరిపోవడం లేదక్కా.. వాడు నాకు దూరం అవుతాడేమోనని భయం పట్టుకుంది. వాడంటే నాకు ప్రాణం అక్కా.. వాడు లేకపోతే నేను బతకలేను వాడు నాకు కావాలి. లైఫ్‌లాంగ్‌ నేను వాడితో కలిసి ఉండాలి అక్క అంటూ ఏడుస్తూనే ఉంటుంది. వెంకీ అలా మారడానికి ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుంది. ముందు ఆ కారణం ఏంటో తెలుసుకో.. వెంకీ నీతో మాట్లాడకుండా ఉండలేడు.. స్వచ్చమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమి ఉండదు నందు. నీ ప్రేమే నిన్ను గెలిపిస్తుంది ప్రశాంతంగా వెళ్లి పడుకో అంటూ ఓదార్చి వెళ్లిపోతుంది ఇందు.

Advertisement

మరుసటి రోజ ఉదయమే పెళ్లి కొడుకు డ్రెస్‌ వేసుకుని ఐశ్వర్య ముందుకు వెళ్లి ఇంకాసేపట్లో మనకు పెళ్లి జరగబోతుంది అని చెబితే ఐషు కోపంగా కొట్టి వెళ్లిపోతుంది. అంతా గమనించిన రాజు, ఇందు దగ్గరకు వెళ్లి నీకు పెళ్లి చూపులు అన్నాము కానీ ఐశ్వర్యతో అని చెప్పలేదు కదా ఎందుకు ఇలా ఒవర్‌ చేస్తున్నావు అంటూ నిజం చెప్పగానే.. లక్కీ షాక్‌ అవుతాడు. ఐషును తాను ప్రేమిస్తున్నానని వేరే అమ్మాయిని తాను ఎలా పెళ్లి చేసుకుంటాను.. అయినా ముందు మా అమ్మ ఎవరో తెలియాలి. అమ్మ ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుంటాను అంటూ తిరకాసు పెట్టగానే.. రాజు కోపంగా లక్కీని తిట్టి నీకు అమ్మ కావాలా వద్దా అంటూ తిడతాడు. లక్కీ, రాజు చెప్పినట్టు వింటానని వెళ్లిపోతాడు.

లక్కీని పెళ్లిచూపులకు చూసుకోవడానికి వచ్చిన వ్యక్తులను అరైంజ్‌ చేస్తాడు రాజు. వాళ్లు వచ్చి తమ యాక్టింగ్‌ దంచేస్తుంటారు. ఆడపిల్లకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్టు చేస్తాడు రాజు. అప్పుడే వచ్చిన భ్రమరాంబ ఆ దిక్కు మొక్కు లేనోడికి ఇక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం ఏంటి..? అయినా పెళ్లి చూపులు అమ్మాయ ఇంట్లో ఉండాలి కదా ఇక్కడ ఉండటమేంటి..? అని భ్రమరాంబ ప్రశ్నిస్తే.. అక్కడైతే మీరు రారు కదా..? ఇక్కడైతే మీరందరూ ఉంటారని ఇక్క పెళ్లి చూపుల ఏర్పాటు చేశానని రాజు చెప్తాడు. రేఖ మాత్రం కోపంగా చూస్తూ మౌనంగా ఉంటుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఝాన్సీని ఇరకాటంలో పెట్టేసిన బిగ్ బాస్.. బలయ్యేది ఎవరు?

శ్రీముఖికి కౌంటర్ ఇచ్చిన బిగ్ బాస్ బోలే.. దెబ్బకు రియాక్షన్?

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Big Stories

Advertisement
×