E-Paper
Advertisement

జోరుగా నైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం, మూడు రోజులు అలర్ట్

జోరుగా నైరుతి రుతుపవనాలు.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం,  మూడు రోజులు అలర్ట్
Advertisement

Weather Updates: ఎట్టకేలకు తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరందుకున్నాయి. రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. మన్నార్ వరకు ఏర్పడిన ద్రోణి కారణంగా నేటి నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అటు అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం ఒకే మాదిరిగా వర్షం పడింది.

తెలంగాణ వ్యాప్తంగా జోరుగా నైరుతి రుతుపవనాలు

Advertisement

వాతావరణ శాఖ అంచానాలు వేసినదాని కంటే ముందుగా తెలంగాణలో రుతుపవనాలు జోరందుకున్నాయి. రాగల 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరించనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జూన్ 8న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి.

ఎల్ నినో కారణంగా వానలు ముఖం చాటేశాయి. దీంతో తెలంగాణలో రుతుపవనాల విస్తరణ మరింత ఆలస్యమైంది. రాయలసీమ నుంచి తెలంగాణ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుండటంతో రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి.

Advertisement

అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షం.. మరో మూడు రోజులు అలర్ట్

దీనికారణంగా రానున్న మూడు రోజులు అంటే మంగళవారం నుంచి గురువారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. వర్షంతోపాటు ఉరుములు, మెరుపులు అధికంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు.

మంగళవారం ఉదయం వరకు మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో రెండు గంటలపాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రాబోయే రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయని పేర్కొంది.

ALSO READ: తుంగభద్ర జలాలపై.. రాజీపడే ప్రసక్తే లేదు.. తేల్చేసిన మంత్రి ఉత్తమ్

ప్రస్తుతం హైదరాబాద్‌లో వర్షం తగ్గుముఖం పట్టింది. ఉదయం వేళ సిటీలో వాతావరణం పొడి ఉండనుంది. ఇక హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కూకట్‌పల్లి, మణికొండ, శంషాబాద్ ప్రాంతాల్లో దాదాపు రెండు గంటల సేపు భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వర్షం తగ్గుముఖం పట్టింది.

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×