BigTV English

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Bathukamma: బతుకమ్మ పాటలు..ఆడబిడ్డల ఆటలతో తెలంగాణ మార్మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటేలా జరిగాయి. పల్లె, పట్నమనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… ఒక్కేసి పువ్వేసి సందమామా.. పాటలతో వీధులన్నీ మార్మోగాయి.


హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయం వద్ద ఘనంగా బతుకమ్మ సంబరాలు
మరోవైపు బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సర్కార్ ఆధ్వర్యంలో మొదటిరోజు హనుమకొండ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

తీరొక్క పూలతో తొమ్మిది రోజులపాటు పూజలందుకొనే బతుకమ్మ దీవెనలతో రాష్ట్రంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు రాష్ట్ర మంత్రులు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా, తెలంగాణ సుభిక్షంగా ఉండేలా గౌరమ్మ ఆశీర్వదించాలని కోరారు. బతుకమ్మ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, మహిళలను సంఘటితం చేస్తుందన్నారు.


వేడుకల ప్రారంభోత్సవంలో మంత్రి సురేఖ చిత్తూ చిత్తుల బొమ్మ.. శివునీ ముద్దులగుమ్మ అంటూ బతుకమ్మ పాటను ఆలపించగా..పక్కనే ఉన్న మంత్రి సీతక్క, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి గొంతు కలిపారు. వేదికకు ఎదురుగా ఉన్న మహిళలు ఉత్సాహంగా నృత్యం చేశారు.

తెలంగాణ సంస్కృతికి చిహ్నహైన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడున్న వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చెప్పేలా అంతా ఒకచోట చేరి పండుగలు చేసుకుంటున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. 2వేల మంది మహిళలు ఒక్కచోట చేరి ఆడిపాడారు. తీరొక్క పూలతో … బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురుసింది.. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమనారు.

Also Read: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

పలు ప్రాంతాల్లో అయితే వర్షాన్ని సైతం ఆలోచించకుండా బతుకమ్మ ఆడారు.. కోలాటాలు వేశారు. ఈ పండుగ తెలంగాణ మహిళల సామూహిక ఆనందం, సంస్కృతి సంరక్షణకు మంచి ఉదాహరణ.

 

Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×