Vijay Devarakonda: ఇటీవల సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ (Betting App)ప్రమోషన్లలో భాగంగా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) వంటి వారిపై కేసులో నమోదు అయ్యాయి. ఇప్పటికే రానా విచారణ జరగాల్సి ఉండగా ఆయన కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయానని తెలిపారు. ఇటీవలే ప్రకాష్ రాజ్ విచారణ కూడా పూర్తి అయింది. అయితే తాను ఇకపై ఇలాంటి ప్రమోషన్స్ చేయనని క్లారిటీ ఇచ్చారు. ఇక నేడు నటుడు విజయ్ దేవరకొండ విచారణ ఉన్న నేపథ్యంలో ఈయన ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
ఇది గేమింగ్ యాప్…
నేడు ఉదయం విచారణకు హాజరైన విజయ్ దేవరకొండను సుమారు నాలుగు గంటల పాటు అధికారులు పలు ప్రశ్నలు వేస్తూ విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఈయన విచారణ ముగియడంతో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను అంటూ పలు ఛానల్లో హెడ్డింగ్స్ వేస్తున్నారని తెలిపారు. తాను ప్రమోట్ చేసింది బెట్టింగ్ యాప్స్ కాదని, గేమింగ్ యాప్స్(Gaming Apps) అంటూ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా తాను ప్రమోట్ చేసిన A 23, డ్రీం లెవెన్ అనే యాప్స్ భారత దేశంలో చట్టబద్ధంగా గుర్తింపు పొందాయని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
తేడాలను అర్థం చేసుకోండి…
ఇక గేమింగ్ యాప్స్ ఐపీఎల్, కబడ్డీ, వాలీబాల్ వంటి వాటికి స్పాన్సర్షిప్ కూడా ఇస్తుంటారని ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. నేను ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్ ప్రభుత్వం గుర్తింపు పొందినవని తెలిపారు. గేమింగ్ యాప్ వేరు, బెట్టింగ్ యాప్ వేరు ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి అర్థం చేసుకోమని ఈ సందర్భంగా అందరినీ కోరారు. ఇక నేడు జరిగిన ఈ విచారణలో భాగంగా అధికారులు తన బ్యాంకుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల గురించి అడిగారని వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా తాను సమర్పించానని విజయ్ దేవరకొండ తెలియజేశారు. ఇక తదుపరి తనను విచారణకు పిలిస్తే పూర్తిగా అధికారులకు సహకరిస్తానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు.
నేను చేసింది లీగల్ గేమింగ్ యాప్ ప్రమోషన్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాదు : విజయ్ దేవరకొండ
ముందు ఈ రెండిటికి తేడా తెలుసుకొని వార్తలు రాయాలి
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కూడా విచారణ జరుగుతోంది
కానీ నన్ను పిలిచింది గేమింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణ కోసం
బ్యాంక్… pic.twitter.com/GQEmXmIKLX
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025
ఇలా విజయ్ దేవరకొండ ఈడీ విచారణ పూర్తికావడంతో తదుపరి మంచు లక్ష్మి ఈ విచారణకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. అయితే గత కొద్దిరోజుల క్రితం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల పై అధికారులు ఉక్కు పాదం మోపుతూ సెలబ్రిటీల నుంచి మొదలుకొని యూట్యూబర్ల వరకు కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికి వస్తే ఈయన ఇటీవల గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్(King Dom) సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా హిట్ కావడంతో ఈయన తదుపరి సినిమా పనులలో బిజీ అయ్యారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో అలాగే రవికిరణ్ డైరెక్షన్లో కూడా సినిమాలకు కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read: Vijay Sethupathi -Puri : ఫుల్ స్పీడుమీదున్న పూరీ.. కొత్త షెడ్యూల్ కోసం ఫ్లైట్ ఎక్కిన టీం