Thief gifts luxury home Girlfriend | ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌కి రూ.3 కోట్లు విలువైన విలాసవంతమైన లగ్జరీ ఇల్లు కానుకగా ఇచ్చాడు. అంతేకాదు ఆమెకు ఇష్టమని మరో రూ.22 లక్షలు విలువైన ఒక ఆక్వారియంను కూడా బహూకరించాడు. అబ్బా! ప్రేమంటే అతడిదే అని అందరూ భావిస్తే పొరపాటే.. ఎందుకంటే అతనో దొంగ. ఇదంతా చోరీ సొమ్ముతోనే కొనుగోలు చేసి ఆమెకు ఇచ్చాడు. ఈ ఆశ్చర్య విషయాలు పోలీసులు విచారణలో వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన పంచాక్షరి స్వామి (37) అనే యువకుడు ఇటీవల బెంగుళూరులో దొంగతన చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి గురించి విచారణ చేయగా.. అతను దాదాపు 20 ఏళ్ల నుంచి దొంగతనాలు చేస్తూనే ఉన్నాడని బెంగళూరు పోలీసులకు తెలిసింది. పైగా అతనికి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో ఒక సినీ నటితో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసింది. ఆ ప్రియురాలికి రూ.3 కోట్లు విలువైన ఇల్లు, రూ.22 లక్షలు విలువైన అక్వేరియంను గిఫ్ట్‌గా ఇచ్చాడట. జనవరి 9 న బెంగళూరు మడివాలా ప్రాంతంలో దొంగతనం జరిగింది. ఆ కేసులో నగర పోలీసులు విచారణ చేసి పంచాక్షరి స్వామిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 181 గ్రాముల బంగారం, 300 గ్రాములకు పైగా వెండి, ఇతర ఖరీదైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోలాపూర్ లోని అతడి నివాసంలో మరికొంత బంగారం బిస్కెట్ల రూపంలో ఉన్నట్లు తెలిపారు.
Also Read: భర్త కిడ్నీ అమ్మేసిన భార్య.. ప్రియుడితో జంప్.. ఎలా చేసిందంటే..
ఎవరీ పంచాక్షరి స్వామి
స్వామి తండ్రి ఒక రైల్వై ఉద్యోగి. చిన్నతంలోనే తండ్రి చనిపోవడంతో అతని తల్లికి ఆ ఉద్యోగం లభించింది. కానీ స్వామి మాత్రం సాధారణ జీవితానికి కాకుండా దొంగతనాలు చేయడమే వృత్తగా ఎంచుకున్నాడు. 2009 నుంచి భారీ స్థాయిలో దొంగతనాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. అతని కొన్ని సంవత్సరాల క్రితం వివాహం కూడా జరిగింది. ఒక పాప కూడా పుట్టింది. అయినా తన బుద్ధి మార్చుకోకుండా చోరి చేయడం కొనసాగించాడు.
ఈ క్రమంలో 2016లో గుజరాత్ లో ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్టు చేయగా.. కోర్టు అతని ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. అలా గుజరాత్ సాబర్మతి జైలులో 6 ఏళ్లు గడిపాడు. ఆ తరువాత 2023, 2024 నుంచి బెంగుళూరుకు మకాం మార్చి.. అక్కడ దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. పంచాక్షరి స్వామి ఒక టక్కరి దొంగ. వందల దొంగతనాలు చేసినా.. చాలా అరుదుగా పట్టుబడ్డాడు. తరుచూ దొంగతనం చేశాక.. పోలీసులు వెంటపడితే.. రోడ్డు మలుపుల వద్దే తన బట్టలు వెంటనే మార్చేసి మరో వేషంలో కనిపించేవాడు. దీంతో చాకచక్యంగా తప్పించుకునేవాడు. 2014-15లో మారుపేరుతో ఒక సినిమా నటితో పరిచయం చేసుకొని ఆమెతో కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో కోల్ కతాలో తనకో స్థావరం కోసం ఆమె పేరుతో తన వద్ద ఉన్న దొంగతనం సొమ్ములో నుంచి రూ.3 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేశాడు. విచిత్రమేమిటంటే సోలాపూర్ లో తన తల్లిపేరు మీద ఉన్న ఇల్లుపై బ్యాంకు నుంచి లోన్ తీసుకొని.. కొన్ని నెలలుగా బకాయిలు చెల్లించలేదు. దీంతో అతనికి బ్యాంకు కోర్టు నోటీసులు పంపింది. పోలీసులు సమాచారం ప్రకారం.. పంచాక్షరి స్వామిపై పలు రాష్ట్రాల్లో దొంగతనాలు కేసులున్నాయి.