E-Paper
Advertisement

Beerla Ailayya: కేసీఆర్‌ను చూస్తే జాలేస్తుంది పాపం: బీర్ల అయిలయ్య

Beerla Ailayya: కేసీఆర్‌ను చూస్తే జాలేస్తుంది పాపం: బీర్ల అయిలయ్య
Advertisement

Beerla Ailayya: బీర్ల అయిలయ్య, ప్రభుత్వ విప్‌ సీఎల్పీ మీడియా సెంటర్‌లో చేసిన వ్యాఖ్యలు.. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనప్పటికీ, కేటీఆర్ విజ‌యోత్సవాలు, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో జిల్లాల పర్యటనలు చేయడాన్ని చూసి జాలేస్తోందని బీర్ల అయిలయ్య ఎద్దేవా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా సంబరాలు జరుపుకోవడం అసమర్థ రాజకీయ నాయకత్వానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీని కాపాడుకునేందుకు కేటీఆర్ నానా పాట్లు పడుతున్నారని, ఓడిపోయిన సర్పంచ్‌లను ఓదార్చే యాత్రలుగా ఆయన పర్యటనలు మారాయని బీర్ల అయిలయ్య విమర్శించారు. కవిత వ్యవహారంతో పార్టీ పూర్తిగా కుదేలవుతుంటే, దాన్ని కాపాడుకోవాలని కేటీఆర్ ఈ హడావుడి చేస్తున్నారని అన్నారు. ఓటమి తర్వాత కూడా విజ‌యోత్సవ సభలు నిర్వహించడం చూస్తే కేటీఆర్ మానసిక స్థితిపై అనుమానం వస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 12,703 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ 8,335 సర్పంచ్ స్థానాలను గెలుచుకుని 66 శాతం విజయం సాధించిందని బీర్ల అయిలయ్య గుర్తు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిపి కేవలం 4,221 సర్పంచ్ స్థానాలకే పరిమితమయ్యాయని తెలిపారు. యాదాద్రి జిల్లాలో కేటీఆర్ విజ‌యోత్సవ సభ నిర్వహించినా, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత సాధించిందన్నారు. మొత్తం 480 సర్పంచ్ స్థానాల్లో 290 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారని, ఇది దాదాపు 60 శాతం విజయం అని స్పష్టం చేశారు.

ఆలేరు నియోజకవర్గంలో 120కి పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, కాంగ్రెస్ నేతల మధ్య పోటీ కారణంగా మాత్రమే కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. అంతేకాదు, ఆలేరు ప్రాంతంలో 30 మందికి పైగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ తరపున పోటీ చేశారన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్థానిక సమీకరణల వల్ల మాత్రమే బీఆర్ఎస్‌కు కొన్నిచోట్ల విజయం దక్కిందని, అది పార్టీ బలం కాదని అన్నారు.

Advertisement

కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయాలు, కేటీఆర్ గెస్ట్ హౌస్ రాజకీయాలు చూసిన తర్వాత.. గెలిచిన సర్పంచ్‌లు కూడా బీఆర్ఎస్‌లో నిలబడరని, అందుకే వారిని నిలబెట్టుకునేందుకు కేటీఆర్ సభలు, సమ్మేళనాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌పై దౌర్జన్యం, బెదిరింపులు చేశారంటూ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అర్థంలేనివని అన్నారు. నిజంగా బెదిరింపులు జరిగితే 4 వేల మంది బీఆర్ఎస్ సర్పంచ్‌లు ఎలా గెలిచారని ప్రశ్నించారు.

గత పదేళ్లలో ప్రతిపక్షాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభాలు, బెదిరింపులతో బీఆర్ఎస్‌లో చేర్చుకున్న చరిత్రను కేటీఆర్ మర్చిపోయారని అన్నారు. అధికారం పోయిన తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయని, చిన్నపాటి ఘటనలు తప్ప పెద్ద ఘర్షణలు ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు.

కేటీఆర్ నోటికొచ్చిన ఆరోపణలు చేస్తూ శునకానందం పొందుతున్నాడని, తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదని బీర్ల అయిలయ్య అన్నారు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ఇక లేదు. నీ పార్టీ పని ఖతం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత ఒక వైపు, హరీష్ రావు మరో వైపు పార్టీకి గుండు కొట్టే పనిలో ఉన్నారని, ముందు పార్టీని కాపాడుకోమని హితవు పలికారు.

రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలను గుర్తు చేస్తూ, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా 80 శాతం సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×