E-Paper
Advertisement

Crash Test: క్రాష్ టెస్ట్ లో సుజుకి బాలెనో అట్టర్ ఫ్లాప్, మరీ ఇంత దారుణమా?

Crash Test: క్రాష్ టెస్ట్ లో సుజుకి బాలెనో అట్టర్ ఫ్లాప్, మరీ ఇంత దారుణమా?
Advertisement

India’s Suzuki Baleno Crash Test:  భారత్ లో తయారైన లాటిన్ అమెరికన్ మార్కెట్లలో అమ్ముడవుతున్న సుజుకి బాలెనోకి తాజాగా క్రాష్ టెస్ట్ జరిగింది. ఈ పరీక్షలో సదరు కారు ఒకే ఒక్క పాయింట్ రేటింగ్ సాధించి ఘోరంగా ఫెయిల్ అయ్యింది. లాటిన్ అమెరికన్ ఆటో మోబైల్ మార్కెట్లోని పలు కార్లకు సంబంధించి తాజాగా NCAP క్రాష్ టెస్ట్‌ జరిగింది. ఇందులో భాగంగానే సుజుకి బాలెనోను పరీక్షించారు. ఈ టెస్ట్ లో ఒక్క స్టార్ భద్రతా రేటింగ్‌ను పొందింది.

సుజుకి బాలెనో క్రాష్ టెస్టులో ఏం తేలిందంటే?

తాజాగా టెస్ట్ చేసిన బాలెనో కారులో రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రామాణికంగా అమర్చడడ్డాయి. అడల్ట్ ప్యాసింజర్స్ కు సంబంధించి ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 42.28 శాతం, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ కోసం 65.46 శాతం,   రహదారి వినియోగదారులకు 48.28 శాతం,  సేఫ్టీ అసిస్ట్ కోసం 58.14 శాతం స్కోర్ చేసింది. ఈ మోడల్‌ ను ఫ్రంటల్ ఇంపాక్ట్, సైడ్ ఇంపాక్ట్, విప్లాష్ ప్రొటెక్షన్, ESC పనితీరు  టెస్ట్ చేశారు. కారు సైడ్ హెడ్ ప్రొటెక్షన్‌ ను ప్రామాణికంగా అందించకపోవడంతో పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ చేయలేదు.

Advertisement

ఫ్రంటల్ క్రాష్ టెస్ట్‌ లో, బాలెనో బలమైన నిర్మాణం, ఫుట్‌ వెల్‌ను చూపించింది. డ్రైవర్, ముందు ప్రయాణీకుల ఛాతీకి తగిన రక్షణను అందించింది. కొన్ని మైనర్ సమస్యలు ఉన్నప్పటికీ, సుజుకి ఫ్రంటల్ టెస్ట్‌ లో ప్రయాణీకులకు మంచి సేఫ్టీని అందించింది. అయితే, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ లో అడల్ట్  ప్రయాణీకులకు బలహీనమైన ఛాతీ ప్రొటెక్షన్ ను చూపించింది. ఈ కారణంగానే కారు ఓవరాల్ తక్కువ రేటింగ్‌కు కారణం అయ్యింది.

పిల్లల భద్రత కోసం, ISOFIX యాంకరేజ్‌లను ఉపయోగించి వెనుకకు ఎదురుగా ఉన్న కాన్ఫిగరేషన్‌ లో చైల్డ్ సీట్లను ఇన్‌ స్టాల్ చేసినప్పుడు బాలెనో పనితీరు చాలా బాగుంది. దాదాపు పూర్తి ప్రొటెక్షన్ ను కనబరిచింది. అయితే, ముందు ప్రయాణీకుల సీటులోని అన్ని చైల్డ్ రెస్ట్రైన్ట్ ఇన్‌స్టాలేషన్‌లు ఫెయిల్ అయ్యింది.

6 ఎయిర్ బ్యాగుల కారుకు 2 స్టార్ రేటింగ్

Advertisement

లాటిన్ NCAP రెండు ఎయిర్‌ బ్యాగ్ ల వెర్షన్‌ ను పరీక్షించాలనే నిర్ణయం తర్వాత, సుజుకి బాలెనో కోసం సైడ్ బాడీ, కర్టెన్ ఎయిర్‌ బ్యాగ్‌ లను ఏర్పాటు చేసింది. తాజాగా అప్ డేట్ చేసిన ఆరు ఎయిర్‌ బ్యాగ్ ల వెర్షన్ ఆ తర్వాత టెస్ట్ చేయబడింది. ఈ సమయంలో కారు 2 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ వెర్షన్ 79.38 శాతం అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌ను కనబరిచింది.  చైల్డ్ ఆక్యుపెంట్, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్, సేఫ్టీ అసిస్ట్ స్కోర్‌ లో ఎలాంటి ఛేంజెస్ లేవు. అదనపు ఎయిర్‌ బ్యాగ్‌ల కారణంగా  సైడ్ ఇంపాక్ట్, పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌ లలో హెడ్ ప్రొటెక్షన్ మరింత బాగా పెరిగింది. లాటిన్ NCAP పరీక్షించిన బాలెనో ఇండియాలో తయారు చేయబడినప్పటికీ, భద్రతా రేటింగ్ ఇండియన్ స్పెక్ బాలెనోకు నేరుగా వర్తించకపోవచ్చు. ఎందుకంటే కారులో ఉపయోగించిన పరికరాల స్థాయి, భద్రతా లక్షణాలు మార్కెట్‌ ను బట్టి మారుతూ ఉంటాయి.

Read Also: ICOTY 2026లో సత్తా చాటిన మహీంద్రా XEV 9e, ఆ కేటగిరీలో అవార్డు కైవసం!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×