E-Paper
Advertisement

కొడంగల్‌లో కాదు.. ధైర్యముంటే ముందు సిరిసిల్లలో గెలువు! కేటీఆర్‌కు ఐలయ్య ఓపెన్ ఛాలెంజ్

కొడంగల్‌లో కాదు.. ధైర్యముంటే ముందు సిరిసిల్లలో గెలువు! కేటీఆర్‌కు ఐలయ్య ఓపెన్ ఛాలెంజ్
Advertisement

Beerla Ilaiah: సిరిసిల్లలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్న చిల్లర మాటలకు, ఆయన చేస్తున్న ఊహాజనిత విమర్శలకు అసలు అర్థమే లేదని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం సీఎల్పీ మీడియా హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఆస్తుల చిట్టాను సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టినా దానిపై ఇప్పటివరకు ఎలాంటి సమాధానం లేదని నిలదీశారు.

రూ.80 వేల జీతం నుంచి వేల కోట్లు ఎలా వచ్చాయి?

Advertisement

ఒకప్పుడు నెలకు రూ.80 వేల జీతం తీసుకున్న కేటీఆర్‌కు, ఈరోజు రూ.5,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలని బీర్ల ఐలయ్య సవాల్ విసిరారు. 2006 నాటికి ఉన్న ఆస్తుల స్థాయి నుంచి, 2014 నాటికి ఏకంగా 15 కంపెనీలలో భాగస్వామ్యాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే, రూ.3,000 కోట్ల విలువైన మూడు భారీ హోటళ్లు, వాటిలో ఉన్న 400 గదులు కేటీఆర్‌కు సంబంధించినవి కావా అని సూటిగా నిలదీశారు. పట్టాభిరామ్, శ్రీధర్‌లను బెదిరించి ఆ హోటళ్లను దౌర్జన్యంగా లాక్కున్న మాట వాస్తవం కాదా అని ఆయన మండిపడ్డారు.

పామ్‌హౌస్ పాలనకు కాలం చెల్లింది..

Advertisement

సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన పామ్‌హౌస్‌లు, వాటి వెనుక ఉన్న అక్రమ సంపాదన నిజం కాదా అని ఐలయ్య ప్రశ్నించారు. గతంలో కేసీఆర్‌ను ‘బట్టలూడదీసి కొడతా’ అని ఘాటుగా విమర్శించిన తలసాని శ్రీనివాసయాదవ్, ఇప్పుడు కేటీఆర్‌తో కలిసి కొడంగల్‌‌లో సభ పెడతామనడం విడ్డూరంగా ఉందన్నారు. కొడంగల్ దాకా ఎందుకు, ధైర్యముంటే ముందు సిరిసిల్లలో గెలిచి చూపించాలని ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వం త్వరలోనే సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ లలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, బీఆర్‌ఎస్ నాయకుల అక్రమాల చిట్టాను ప్రజల ముందు ఉంచుతుందని హెచ్చరించారు.

మోదీకి వణుకు పుట్టేలా భారీ బహిరంగ సభ

కేంద్రం చేపడుతున్న జనాభా లెక్కల కులగణనలో ఓబీసీలను చేర్చాలని, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వారికి సరైన వాటా దక్కాలంటే ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక శాఖను, ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా చేపట్టిన ఏకైక నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. బిసి అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీలను అనగదొక్కుతున్నారని విమర్శిస్తూ, శంషాబాద్ వద్ద మోదీకి వణుకు పుట్టేలా భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు.

Also Read:అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే.. చిన్న కొడుకు కేటీఆర్: అద్దంకి దయాకర్ 

Tags

Related News

అబద్ధాలకు పెద్ద కొడుకు కేసీఆర్ అయితే.. చిన్న కొడుకు కేటీఆర్: అద్దంకి దయాకర్

తీర్పు వచ్చేవరకూ ఆగాల్సిందే.. ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టు కీలక నిర్ణయం!

అబద్ధాలు నేర్చుకోవాలంటే కేటీఆర్ దగ్గర చేరాల్సిందే! గజ్జెల కాంతం

ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫస్టియర్ నుంచి ఇంటర్నల్స్ కీలకం, కొత్త రూల్స్ తెచ్చిన బోర్డు

అందర్నీ వాడేస్తున్నారు.. తొలిపార్ట్ రెండున్నర నిమిషాలే.. సెకండ్ పార్టీలో గుట్టు అంతా

కేవలం ఉద్యోగం రాలేదని.. ఆ మహిళ ఏం చేసిందంటే, హైదరాబాద్‌లో చెప్పలేని దారుణం

హైదరాబాద్‌ మహానగరంలో నేటి నుంచి క్యూర్ చట్టం.. పెరగనున్న ప్రాపర్టీ ట్యాక్స్

Big Stories

Advertisement
×