E-Paper
Advertisement

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు ఇవే!

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు ఇవే!
Advertisement

Samsung Galaxy Watch 9 review:  టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన లేటెస్ట్ స్మార్ట్‌ వాచ్ సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ వాచ్ 9’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అద్భుతమైన డిజైన్, బెస్ట్ ఫెర్ఫామెన్స్, లేటెస్ట్ హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో.. వస్తున్న ఈ వాచ్ టెక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టు కుంటోంది. మునుపటి మోడళ్లతో పోలిస్తే.. ఇందులో చేసిన మార్పులు ఏంటి, దీని ధర ఎంత ? అంతే కాకుండా మరిన్ని వివరాలు రివ్యూలో పూర్తిగా తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, డిస్‌ప్లే :

గెలాక్సీ వాచ్ 9 డిజైన్ విషయానికి వస్తే.. ఇది గత మోడల్ పోలికలతోనే.. క్లాసిక్ కుషన్ షేప్‌లో వస్తుంది. ఇది చూడటానికి చాలా ప్రీమియంగా ఉండటమే.. కాకుండా తేలిక పాటి బరువుతో వస్తుంది. 40mm ,44mm అనే రెండు సైజుల్లో ఇది లభిస్తుంది. 40mm వేరియంట్ కేవలం 31.5 గ్రాములు ఉండగా.. 44mm మోడల్ 34 గ్రాముల బరువుతో రోజంతా వాడటానికి ఎంతో ఈజీగా ఉంటుంది.

Advertisement

ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో సూపర్ అమెలోడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్సతో వస్తుంది. దీని వల్ల ఎండలో బయట.. తిరుగుతున్నప్పుడు కూడా స్క్రీన్ పై ఉన్న సమాచారం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా స్క్రీన్ సేఫ్టీ కోసం బలమైన సాఫైర్ క్రిస్టల్ గ్లాస్‌ను వాడారు.

పెర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్:

ఈ వాచ్ పెర్ఫార్మెన్స్ పెంచడానికి శామ్‌సంగ్ దీంట్లో సరి కొత్త ప్రాసెసర్‌ను అందించింది. దీనికి .. తోడు 2GB RAM , 32GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. వేర్ ఓఎస్ ఆధారిత వన్ యూఐ వాచ్ సాఫ్ట్‌వేర్‌పై ఇది పని చేస్తుంది. యాప్స్ ఓపెన్ చేయడం, మెనూలు మార్చడం వంటివి చాలా స్మూత్‌గా జరిగి పోతాయి. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్ కూడా ఉండటం దీని ప్రత్యేకత.

హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లు:

Advertisement

ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వారికి గెలాక్సీ వాచ్ 9 ఒక పర్ఫెక్ట్ కంపానియన్ అని చెప్పొచ్చు. ఇందులో శామ్‌సంగ్ హెల్త్ యాప్ ద్వారా అనేక కొత్త ఫీచర్లు యాడ్ చేసారు.

డైలీ కార్డియో లోడ్:

నిద్రకు సంబంధించిన సమగ్ర వివరాలు , స్లీప్ అప్నియా డిటెక్షన్ ఆప్షన్లు ఇందులో ఉంటాయి. అంతే కాకుండా.. ఈసీజీ , బ్లడ్ ప్రెజర్ వంటి కొన్ని హెల్త్ ఫీచర్లు కేవలం శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌లతో మాత్రమే పని చేస్తాయనే విషయాన్ని గమనించాలి.

ధరల వివరాలు :

మార్కెట్లో శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ప్రారంభ ధర రూ. 37,999 నుంచి మొదలవుతుంది.

40mm బ్లూటూత్ మోడల్: దాదాపు రూ. 37,999

40mm LTE మోడల్: దాదాపు రూ. 41,999

44mm బ్లూటూత్ మోడల్: దాదాపు రూ. 40,999

44mm LTE మోడల్: దాదాపు రూ. 44,999

Also Read: గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

బ్యాటరీ లైఫ్:

ఈ వాచ్‌లో ఉన్న ఏకైక మైనస్ పాయింట్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. 40mm మోడల్‌లో 390mAh బ్యాటరీ ఉండగా.. సాధారణ వాడకంలో ఇది ఒక రోజు మాత్రమే బ్యాకప్ ఇస్తుంది. వైర్‌లెస్.. ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ.. ఛార్జింగ్ వేగం కొద్దిగా నెమ్మదిగా ఉండటం గమనించవచ్చు.

అద్భుతమైన డిస్‌ప్లే, ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోరుకునే.. ఆండ్రాయిడ్ యూజర్లకు శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఒక చక్కటి ఆప్షన్. బ్యాటరీ లైఫ్ కొంచెం మెరుగ్గా ఉంటే బాగుండు అనిపించినా.. ఓవరాల్‌గా ఇది ఒక పాలిష్డ్ అప్‌గ్రేడ్ వాచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది..’రోహిణి ఇంజనీరింగ్ కాలేజ్’ ప్రత్యేకతలివే!

పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

చలికాలంలో వేడి నీళ్ల కోసం ఏ గీజర్ కొనాలి? గ్యాస్ Vs ఎలక్ట్రిక్ పూర్తి గైడ్!

వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

ఫ్రిజ్ క్లీనింగ్ కష్టమా? ఈ అల్యూమినియం ఫాయిల్ ట్రిక్‌తో మీ పని ఈజీ!

Big Stories

Advertisement
×