PaPa Movie Traile Launch : “డాడా” అనే మూవీ తమిళంలో రీసెంట్ గా రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇదే మూవీని తెలుగులో “పాపా” (PaPa Movie) అనే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని “ది రాజా సాబ్” (The Raja Saab) డైరెక్టర్ మారుతి (Director Maruthi) చేతుల మీదుగా లాంచ్ చేశారు.
జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై, నిర్మాత నీరజ కోట “పాపా” (PaPa Movie) అనే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో కూడా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మారుతి లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ సందర్భంగా మారుతి మాట్లాడుతూ “పాపా “పేరుతో తమిళ సెన్సేషనల్ మూవీ “డాడా” తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ సినిమా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకున్న ఆయన… ఈ సబ్జెక్ట్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే చిత్ర బృందానికి ముందుగానే తన విషెస్ తెలియజేశారు.
గత ఏడాది తమిళంలో రిలీజ్ అయిన “డాడా” మూవీలో కవిన్, అపర్ణదాస్ హీరో హీరోయిన్లుగా నటించారు. గణేష్ కే బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ ఆడియన్స్ ను విశేషంగా మెప్పించింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా, అతి తక్కువ బడ్జెట్ తో రూపొంది, 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హార్ట్ టచింగ్ సాంగ్స్ హైలెట్ అని చెప్తున్నారు. తండ్రి, కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో ఎమోషన్, ప్రేమ, కామెడీ వంటి అంశాలన్నీ ఉన్నాయని, ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా (PaPa Movie)ను ఎంజీఎం సంస్థ అచ్చిబాబు రిలీజ్ చేయబోతున్నారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే… అల్లరి చిల్లరగా తిరిగే ఓ అబ్బాయికి నెలల వయసు ఉన్న పిల్లాడు దొరికితే ఏం చేశాడు? ఆ పిల్లాడు తన లైఫ్ లోకి వచ్చాక హీరో ఎలా మారాడు? అన్నదే ఈ సినిమా స్టోరీ. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక మరోవైపు డైరెక్టర్ మారుతీ (Director Maruthi) “ది రాజా సాబ్” (The Raja Saab) అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ రొమాంటిక్ హర్రర్ కామెడీ మూవీలో నిధి అగర్వాల్ (Nidhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు.